డ్రగ్స్ దొరికినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరయిన చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర సంస్థలకు లేఖ రాసాను గతంలోనే అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. స్పెషల్ విచారం టీం ఏర్పాటు చెయ్యాలని. హైకోర్టు కు పోయింది నేను. డ్రగ్స్ ను అడ్డం పెట్టుకుని, సినిమా వాళ్లపై టీఆర్ఎస్ వాళ్ళు పట్టు సాధించారు. నేను మళ్ళీ కోర్టుకి వెళ్తాను. దాడి చేసిన పబ్బుకు 24 గంటల సరఫరాకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సూదిని ప్రణయ్ రెడ్డి విషయంలో…
తెలంగాణలో రూ. 250 కోట్లతో జాంప్ ఫార్మాను నెలకొల్పడం సంతోషకరం అన్నారు మంత్రి కేటీఆర్. దీనివల్ల 200 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పరోక్షంగా వేలాదిమందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. గుజరాత్ పారిశ్రామికవేత్తలు తమకు అహ్మదాబాద్ కంటే హైదరాబాదే ఎక్కువ ఇష్టం అంటున్నారు. జీనోమ్ వ్యాలీ ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పరిశ్రమలకు అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారన్నారు. 50 బిలియన్ డాలర్లుగా ఉన్న జీనోమ్ వ్యాలీ పెట్టుబడులు.. 2030 కల్లా 100 బిలియన్లకు…
కట్టుకున్న భర్తను భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు కలిసి అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బీడీ కాలనీ లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి 36 సంవత్సరాల కాసాల బ్రహ్మయ్య చారిగా గుర్తించారు. కాసాల బ్రహ్మయ్య చారిని హత్యచేసింది భార్య నందిని, మామ దత్తాత్రేయ, అత్త గంగామణిలుగా పోలీసులు గుర్తించారు. రూరల్ సీఐ శ్రీనివాస్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందచేశారు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన…
నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల పాఠశాలలో వాచ్ మెన్ వెంకటేష్ అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు అమ్రాబాద్ మండలం వెంకటేశ్వర్ల బావికి చెందిన వెంకటేష్ లింగాల గురుకుల పాఠశాలలో గత 13 సంవత్సరాల నుండి ఔట్ సోర్సింగ్ లో వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత ఏడాది క్రితం పాఠశాలకు వచ్చిన సూపరింటెండెంట్ సింగయ్య గత కొంత…
*నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి * నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎంపీలను ఉద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోడీ * నేడు పాకిస్తాన్ స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టులో విచారణ * నేడు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పార్లమెంటరీ సమావేశం *ఐపీఎల్: నేడు రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ *నేడు యూకే ఆధ్వర్యంలో యూఎన్ఎస్ సీ సమావేశం. ఉక్రెయిన్ పరిస్థితులపై చర్చ * నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.…
తెలంగాణ రైతుల పక్షాన తాము పోరాడుతున్నామన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. సాంప్రదాయ పంటలను వదిలేసి ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు చెప్పినందుకు రైతులు వరి పంటకు అలవాటు పడ్డారు. రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పుకుంటుందని మండిపడ్డారు. కేంద్ర సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 100 శాతం న్యాయం చేయలేవు. పంజాబ్ లో 100 శాతం కొంటున్న కేంద్రం ఇక్కడ మాత్రం వివక్ష చూపుతుందన్నారు జగదీష్ రెడ్డి. కేంద్రం ఎటువంటి…
కాలుష్యం పెరిగి కొద్దీ అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం కాలుష్య సుడిగుండంలా మారుతోంది. పారిశ్రామిక అభివృద్ధి ఈ ప్రాంతానికి శాపంలా మారింది. రామగుండంలో భూగర్భం ఉపరితలం అంతా విషతుల్యంగా తయారైంది. ఏ విష వాయువు ఎప్పుడు వ్యాపిస్తుందో తెలియక తాగే నీరు కలుషితంతో అనారోగ్యాల బారిన పడుతూ జనం ఆందోళన చెందుతున్నారు. రామగుండం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నియోజకవర్గ వ్యాప్తంగా జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్, జెన్…
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటనలో బాధితుడు శ్రీనివాస్ మృతిచెందాడు. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిన్న సాయంత్రం మెరుగైన వైద్యం కోసం శ్రీనివాస్‌ను వరంగల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు వైద్యులు తెలిపారు. అయితే చికిత్సకు సహకరించక పోవడంతో శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతతో మృతిచెందినట్లు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అసలే ఆర్థిక…
ధాన్యం కొనకుంటే అధికారం నుంచి కేసీఆర్ తప్పుకోవాలి. నీచ, నికృష్టమైన, మతి తప్పిన కేసీఆర్ ఆలోచనలతో రైతులు మునిగిపోయారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి తప్పులు చేస్తే.. శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్ అనుభవించాలా? చేతకాక,చేవలేక ముఖ్యమంత్రి చిల్లర పనులు చేస్తున్నాడు. పెంచిన విద్యుత్, బస్ చార్జీలు నుంచి ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం చేస్తున్నాడు. లక్షలాది మంది రైతులు, పౌల్ట్రీ రంగం ఉసురు కేసీఆర్ పోసుకుంటున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల. తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని…