ముఖ్యమంత్రి కేసీఆర్ కు బండిసంజయ్ బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వం రూ. 6 వేల కోట్ల భారాన్ని తెలంగాణ ప్రజలపై మోపుతూ పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని, లేదా రిఫరెండమ్ కు సిద్ధం కావాలని సవాల్ చేస్తూ సీఎం కు లేఖ రాశారు. ఈ ప్రజా వ్యతిరేక చర్యను వెంటనే ఉపసంహరించుకొని ప్రజలకు ఉపశమనం కల్పించాలని లేదా పెంచిన విద్యుత్ ఛార్జీల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రిఫరెండమ్ కు సిద్ధం కావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రెఫరెండం…
ఈమధ్య కాలంలో వన్యప్రాణులు, పాములు, ఏనుగులు జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నాయి. కార్లు, స్కూటర్లు, ఇళ్ళల్లోకి పామలు, ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో పాము కలకలం సృష్టించింది. గంట పాటు అటవీశాఖ సిబ్బందిని పాము తిప్పలు పెట్టింది. రెస్క్యూ ఆపరేషన్ చేశాక కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకుంది. మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో ఒక్కసారిగా విశేష అతిథి సందడి చేసింది. ఉదయం కార్యాలయం తెరిచేసరికి ఓ పాము హల్చల్ చేసింది. కలెక్టర్ సి ఛాంబర్ లో…
బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ లో ఇంటర్ , డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఈ నెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు చెప్పారు. బీసీ బాలబాలికల గురుకుల కాలేజీల్లో 2022-23 వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్ లో చేరాలనుకునే విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. డిగ్రీ కోర్సుల కోసం…
పీజీ వైద్య సీట్ల లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని రేవంత్ గవర్నర్ కు లేఖ రేసారు. తెలంగాణ లో సీట్లు బ్లాక్ చేసే వాళ్లకు యూనివర్సిటీ లేఖ రాస్తుంది..బ్లాక్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి దందాలు చేసే వాళ్లపై కేసులు కూడా పెడుతున్నాం. ఒక్క సిటు కూడా ఇంతవరకు మేనేజ్మెంట్ లకు ఇవ్వలేదు.. నీకు సిగ్గు దమ్ము,నిజాయితీ ఉంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ లతో దర్యాప్తు చేయించుకోవాలన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.…
హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో వున్న మాదాపూర్ వడ్డెరబస్తీ వాసులు కలుషిత నీటితో నానా అవస్థలు పడుతున్నారు. కలుషిత నీటి బాధితుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా మరికొందరు అస్వస్థతకు గురికావడంతో మొత్తం బాధితుల సంఖ్య 98కి చేరింది. వాంతులు, విరేచనాలతో కొత్తగా 15 మంది కొండాపూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 52 మంది చికిత్స పొందుతున్నారు. 26 మంది ఇప్పటివరకూ రికవరీ అయ్యారు. కొండాపూర్, గాంధీ…
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. పెన్షన్ల పేరుతో వృద్ధుల వితంతువులు, ఒంటరి మహిళల ఓట్లను దండుకొని అధికారం లోకి వచ్చిన తరువాత మహిళలను మోసం చేసిన ఘనుడు ముఖ్యమంత్రి. దేశంలో ఏ రాష్ట్రంలో వడ్ల సమస్య లేదు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఉందన్నారు. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనడం లేదని, రైతులను మోసం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన…
రోడ్డు ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో తెలీని పరిస్థితి ఏర్పడింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న అశోక్ లేలాండ్ ట్రాలీ వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ట్రాలీ లో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు . మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. https://ntvtelugu.com/ed-attacher-6-crore-property-of-balwinder-singh-in-money-landaring-case/ శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన 25 మంది…
సికింద్రాబాద్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చింతచెట్టునుంచి మంటలు రావడంతో కలకలం రేగింది. జీడిమెట్ల 31 బస్ స్టాప్ వుండే పాలికా బజార్ లో భారీ చింత చెట్టులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున పొగలు చిమ్ముతోంది చింత చెట్టు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలీక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చింతచెట్టు లోలప మంటలు అంటుకొని పొగలు కక్కుతోంది. https://ntvtelugu.com/goa-driver-kidnap-case-what-happend/ పక్కనే ఉన్న ఇళ్లలోకి దట్టమైన పొగలు చేరుకుంటున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే…
* నేడు విశాఖలో రాష్ట్ర మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పర్యటన. ఆ౦ధ్ర యూనివర్సిటిలోని YVS మూర్తి ఆడిటోరియంలో జరగనున్న వర్క్ షాప్ లో పాల్గొనున్న మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ * నేడు భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవం. * భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గుంటూరులో శోభాయాత్ర, బైక్ ర్యాలీ. పాల్గొననున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ. *భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలలో భాగంగా…