తెలంగాణలో దళితుల సమగ్ర ప్రగతికి సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్గిపేట జిల్లానారాయణ రావుపేట మండలం బంజరుపల్లి గ్రామంలో దళిత బంధు అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి శ్రీ హరీశ్ రావు పాల్గొన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు హరీష్ రావు. దళిత బంధు పథకం ద్వారా రూ.10లక్షలతో స్వయం ఉపాధితో దళితులు ఎదగాలి మీ కాళ్లపై మీరు నిలబడాలన్నారు.…
సంగారెడ్డి జిల్లా వెలిమెలకు చెందిన రియల్టర్ హత్య కేసుని చేధించారు పోలీసులు. తెల్లాపూర్ లో రియల్టర్ దారుణహత్యకు గురవడం కలకలం రేపింది. కనిపించకుండా పోయిన రియల్టర్ కడవత్ రాజు చివరకు హత్యకు గురయ్యాడు. హత్యకేసులో మృతుని సోదరుడు రాంసింగ్ నాయక్‌తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు పటాన్ చెరు డీఎస్ పి భీంరెడ్డి.. వెలిమెల కడవత్ రాజు నాయక్ ను హత్య చేసి ఒక చోట తల, మరో చోట…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది చింతపల్లి నరబలి కేసు. నల్గొండ జిల్లా చింతపల్లిలో జరిగిన ఈ ఘోరంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన జరిగి 10 రోజులు అవుతున్నా నిందితులు ఇంకా దొరకలేదు. ఎవరు హత్య చేశారు? లేకపోతే నరబలి ఇచ్చారా? అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. సీసీ కెమెరాలలో రికార్డ్ అవ్వకపోవడంతో నిందితులను పట్టుకునేందుకు కష్టంగా మారింది కేసు. తెలిసిన వ్యక్తులతో పాటు అనుమానంగా ఉన్న వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కొద్దిరోజుల క్రితం చింతపల్లి మహంకాళి విగ్రహం…
మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఉంది. రకరకాల హోదాలు ఇచ్చి ప్రయోజకుడిని చేద్దాం అని కేసిఆర్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ తండ్రి వల్ల కావడం లేదు. కేటీఆర్ నిర్వహించిన ప్రతీ శాఖ దివాలా తీసింది. కేటీఆర్ నిన్న సవాల్ విసిరారు. నాలుగేండ్లు 50 వేల కోట్లు రైతు బంధు ఖాతాలలో వేశాం అన్నారు. కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నా. రైతులకు…
తెలంగాణలో టీఆర్ఎస్- బీజేపీ నేతల అకృత్యాలకు ఉద్యోగులు, జనం బలి అవుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ. వనమా రాఘవ ఎపిసోడ్ ముగియక ముందే.. నిజామాబాద్ లో మరో సంఘటన మొదలైందన్నారు. నిజామాబాద్ లో నలుగురి ఆత్మహత్యలకు బీజేపీ నేతలు కారణం అన్నారు. ఎంపీ అరవింద్ అండ దండలతో దురాగతాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎంకి మానవత్వం ఉంటే వెంటనే జీఓ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మధుయాష్కీ నలుగురు ఆత్మహత్యల వెనక బీజేపీ…
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విషయంలో తెలంగాణ హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీచేసింది. బంజారాహిల్స్ పీఎస్ లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ పై నమోదైన కేసులో ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోరాదంది హైకోర్టు. ఈమేరకు పోలీసులకు నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కార్టూన్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఎంపీ అరవింద్. ముఖ్యమంత్రిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఓ కేసు నమోదైంది. సీఎం కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం చేసి సమాజంలో…
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరన్న నానుడి మరోసారి రుజువైందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్‌గా బరిలో దిగిన మాజీ మేయర్ ఘర్‌వాపసీ అవుతున్నారా? రవీందర్ సింగ్ మనసు మార్చుకున్నారా? తెరవెనక ఏం జరిగింది? టీఆర్ఎస్లోకి రవీందర్‌సింగ్ ఘర్‌వాపసీ..!రవీంద్ సింగ్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్‌గా బరిలో నిల్చొని ఒక్కసారిగా చర్చల్లోకి వచ్చారు. ఆ ఎన్నికల్లో ఓడినా.. గణనీయంగానే ఓట్లు సాధించారు. ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్ను అంటిపెట్టుకుని ఉన్న ఈ మాజీ…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ విషయంపై స్పందించిన మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్, బీజేపీ నేత విఠల్ మాట్లాడుతూ.. మాజీ టీఎస్పీఎస్సీ మెంబర్ గా చెప్తున్న, 1 లక్ష 32 వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్న మాట అబద్ధం అని ఆయన అన్నారు. ఏడేళ్లలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసింది 32 వేల ఉద్యోగాలేనని, కేసిఆర్ నోటిఫికేషన్ లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నడని ఆయన ఆరోపించారు. ఉద్యోగులు…