టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. భారీ వర్షాలు కారణంగా వివిధ ఆస్పత్రుల్లో కరెంట్ సరఫరా లేకుండా పోతోంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పరిధిలోని అడవి మల్లెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ నిండు గర్భిణీకి సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులో పురుడు పోసి తల్లి బిడ్డల ప్రాణాలను కాపాడారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శాంతారాణి, సిబ్బంది. గత రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలైన వర్షం కారణంగా పెనుబల్లి మండల పరిధిలో విద్యుత్ సరఫరా లో ఆటంకం ఏర్పడింది.
ఇదే సమయంలో అడవి మల్లెల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు పురిటి నొప్పులతో బాధపడుతున్న ఎడ్ల బంజర్ గ్రామానికి చెందిన దుర్గా భవానీని ఆమె కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేదు. దీనికి తోడు సరైన సమయంలో ఇన్వర్టర్ ఆన్ కాలేదు. దీంతో ఏంచేయాలో తెలీక, సెల్ ఫోన్ టార్చ్ వెలుగులో దుర్గ భవానీకి డెలివరీ చేశారు వైద్య సిబ్బంది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వైద్య సిబ్బందికి పలువురు కృతజ్ణతలు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ఎవరో వస్తారని చూడకుండా సెల్ ఫోన్ టార్చ్ లైట్ వాడిన వైద్యులపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
CM Jagan : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా