కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని సాకుగా చూపించి ఫిట్నెస్ ధ్రువీకరణ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ఒక రోజు ఆటో, క్యాబ్, లారీల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో బంద్కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కౌంటర్ సిగ్నేచర్ పర్నిట్ ( సింగిల్ పర్మిట్ ) దేశంలోని ప్రతి రాష్ట్రం పొరుగు రాష్ట్రానికి ఇస్తున్నట్లుగా…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిళ రెచ్చిపోయారు. సీఎం పై తీవ్ర విమర్శలు చేశారు. KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతుందని.. చెమటోడ్చి పండించిన పంట కాలువల్లో తేలిపోతుందని ఆగ్రహించారు. చేతులతో ఎత్తుకోలేక, కల్లాల్లో రైతు కన్నీరు పెడుతున్నారని.. KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా?అని నిలదీశారు వైఎస్ షర్మిల. కేంద్రం వడ్లు కొనకున్నా…
నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపూరి కాలనీలోని దారుణం జరిగింది. మైత్రి నివాస్ అపార్టుమెంట్లోని 202 నెంబర్ ఫ్లాట్లో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. తల్లి మృతదేహంతో పాటు మూడు రోజులుగా అపార్ట్మెంట్లోనే కుమారుడు ఉన్నాడు. సాయి కృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని తరచూ తల్లి, కొడుకులు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు. కొడుకు మానసిక స్థిమితం బాగా లేకపోవడంతో కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. ఫ్లాట్ నుండి దుర్వాసన…
తునికాకు సేకరణ కోసం అడవిలోకి వెళ్లి మిస్ అయిన మహిళ ఆచూకీ లభించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సుబ్బక్కపల్లికి చెందిన బండారు శిరీష గత రెండు రోజుల క్రితం తునికాకు సేకరణకు వెళ్లి అడవిలో వెళ్లింది. అయితే ఆమె కనిపించకుండా పోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ కెమెరా తో గాలింపు చేపట్టారు. ఈరోజు ఉదయం భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి శివారు అడవి ప్రాంతంలో పోలీసులు ఆమెను గుర్తించారు. నీరసంగా ఉండడంతో భూపాలపల్లి ఏరియా…
ప్రజలందరికీ అధికార సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని తెలిపారు. రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. మండల కేంద్రమైన ములుగు అభివృద్ధి కై రూ.10 కోట్లు మంజూరు చేసుకున్నామని అన్నారు. మన ఊరు-మన బడి కింద 7300 కోట్లు వెచ్చించి, ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో తరగతులు ప్రారంభిస్తున్నామని…
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ప్రజా సంగ్రామ యాత్రకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించి, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. TRS పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉందని ఎద్దేవ చేశారు. రైతులను ఆదుకోవాలన్న దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజా…
నగరంలోని శంషాబాద్ లోని సంగారెడ్డి మండల రిటైర్డ్ పంచాయితీ అధికారి సురేందర్ రెడ్డి ఇంట్లో గురువారం నాడు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2కోట్ల 31 లక్షల 63వేల 600 అక్రమ ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు (ఏసీబీ) అరెస్టు చేశారు. గురువారం ఉదయం శంషాబాద్ లోని సంగారెడ్డి మండలలోని సురేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా…
తెలంగాణలో అధికారం కోసం బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే అధికారమే లక్ష్యంగా, ప్రజల్లోకి వెళ్లేలా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నారు. జనాలతో మమేకం అవుతున్నారు. దీంతో పాటు ప్రజా సంగ్రామ యాత్రకు జాతీయ నాయకులను కూడా రప్పిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ నెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్…
దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 580 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లో చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, అదనపు డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, పలువురు అధికారులతో కలిసి…
ఉపాధి కూలీలు రోడ్డెక్కారు. పనులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఎంత కష్టపడిన రోజుకూలీకి మాత్రం సరైన ధర ఇవ్వడంలేంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆరుగాళం కష్టపడిన పై యజమానులిచ్చే కూలీ సరిపోవడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడితే వారికి వచ్చే రూ.30 మాత్రమేనా అంటూ ప్రశ్నించారు. కనీస ధర కూడా ఇవ్వకుండా మా శ్రమను యజమాను దోచుకుంటున్నారని మండి పడ్డారు. ఈఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. భూపాలపల్లి జిల్లా లోని గణపురం మండల కేంద్రంలోని…