వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. రెండు రోజుల నుంచి వానలు కాస్తు తగ్గుముఖం పడటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు.. రేపు గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించి.. వరద పరిస్థితిని పరిశీలించనున్నారు. వరద ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేసి, వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇందుకోసం కేసీఆర్ శనివారం రాత్రే వరంగల్ చేరుకున్నారు. భద్రాచలంకు రోడ్డు మార్గం ద్వారా సీఎం పయనమయ్యారు.
రేపు సోమవారం వరంగల్ మీదుగా ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులపై ఏరియల్ సర్వే చేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించానున్నారు. సీఎంతో పాటు మంత్రి హరీశ్‌రావు, ఎంపీ సంతోష్‌కుమార్, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రోడ్లు, భవనాలు, వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.
సీఎం పర్యటన షెడ్యూల్ ఇలా..
ఉదయం 7 గంటలకు హనుమకొండ నుంచి ప్రారంభం
ఉదయం 7:45 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఏరియల్ సర్వే..
అనంతరం అధికారులతో సమీక్ష
ఉదయం 9:30 గంటలకు భద్రాచలం నుంచి తిరుగుపయనం
ఉదయం 9:45 గంటలకు ఏటూరునాగారంలో ఏరియల్ సర్వే..
అనంతరం అధికారులతో సమీక్ష
ఉదయం 11:00 గంటలకు ఏటూరు నాగారం నుంచి తిరుగుపయనం
ఉదయం 11:45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న సీఎం
అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనం
సోమవారం గోదావరి పరివాహాక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే