జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై అత్యాచార ఘటన దేశంలోనే సంచలనంగా మారింది. పోలీసులే నిందితులకు అండగా ఉన్నారని బీజేపీ, కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు దర్యాప్తును సీరియస్ గా తీసుకున్నారు. విచారణ వేగవంతం చేశారు. అయితే ఇవాళ (ఆదివారం) ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అమ్నీషియా పబ్ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరో మైనర్‌తో పాటు ఉమేర్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే అరెస్ట్…
రాజ్యసభ అభ్యర్ధుల ఎంపిపై కసరత్తు చేస్తున్న బీజేపీ నలుగురు అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేసింది. తెలంగాణనుంచి బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మణ్‌కు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖారారు చేశారు. ఆయనకు ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించింది. యూపీనుంచి మిథిలేశ్ కుమార్ లక్ష్మణ్, డాక్టర్ లక్ష్మణ్, కర్ణాటకనుంచి లహర్ సింగ్ సిరోయ, మధ్యప్రదేశ్ నుంచి సుమిత్ర వాల్మికి అభ్యర్థిత్వాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయం ఖరారు చేసింది. తెలంగాణకు నుంచి రాజ్యసభకు ఎంపిక అయిన డాక్టర్ కే.లక్మణ్…
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో టీమ్ తెలంగాణ దూసుకుపోతోంది. వరుసగా పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. తాజాగా తెలంగాణలో రూ. 1400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు హ్యుండై సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్న మొబిలిటీ క్లస్టర్లో ఈ పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ అంగీకారం తెలిపింది. దీంతో పాటు తెలంగాణతో జట్టు కట్టేందుకు మాస్టర్స్ కార్డ్స్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాస్టర్ కార్డ్స్ ప్రెసిడెంట్ మైఖేల్ ఫ్రోమాన్‌తో గురువారం కేటీఆర్ సమావేశమయ్యారు.…
వివాహేతర సంబంధాలు పచ్చటి కాపురాలలో చిచ్చుపెడుతున్నాయి. ప్రియుడి మోజులో భర్తను, సంసారాన్ని నిప్పుల కుంపటిలా చేసుకుంటున్నారు. వాటికి దూరమై నరకయాతనకు దగ్గరవుతున్నారు. ఇలాంటి ఘటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ సైనికుడి భార్యతో రాసలీలకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ప్రియుడ్నే భర్తగా పరిచయం చేసి ఇల్లు అద్దెకు తీసుకున్న కిలాడి..అతడితో శృంగారంలో పాల్గొంది. జూబ్లీహిల్స్ రహ్మత్ నగర్ లోని యాదగిరినగర్ లో ఈ ఘటన జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే.. యాదగిరినగర్ లో…
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టాన్ని సాకుగా చూపించి ఫిట్నెస్ ధ్రువీకరణ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 19న ఒక రోజు ఆటో, క్యాబ్, లారీల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ వెల్లడించింది. ఈ మేరకు హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కౌంటర్ సిగ్నేచర్ పర్నిట్ ( సింగిల్ పర్మిట్ ) దేశంలోని ప్రతి రాష్ట్రం పొరుగు రాష్ట్రానికి ఇస్తున్నట్లుగా…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిళ రెచ్చిపోయారు. సీఎం పై తీవ్ర విమర్శలు చేశారు. KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా? అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల..సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. రైతు కష్టం వానల్లో కొట్టుకుపోతుందని.. చెమటోడ్చి పండించిన పంట కాలువల్లో తేలిపోతుందని ఆగ్రహించారు. చేతులతో ఎత్తుకోలేక, కల్లాల్లో రైతు కన్నీరు పెడుతున్నారని.. KCR దొరగారికి రైతుల కష్టాలు కనపడ్తలేవా?అని నిలదీశారు వైఎస్ షర్మిల. కేంద్రం వడ్లు కొనకున్నా…
నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపూరి కాలనీలోని దారుణం జరిగింది. మైత్రి నివాస్ అపార్టుమెంట్‌లోని 202 నెంబర్ ఫ్లాట్‌లో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమైంది. తల్లి మృతదేహంతో పాటు మూడు రోజులుగా అపార్ట్మెంట్లోనే కుమారుడు ఉన్నాడు. సాయి కృష్ణ మానసిక పరిస్థితి సరిగ్గా ఉండదని తరచూ తల్లి, కొడుకులు గొడవ పడేవారని స్థానికులు చెబుతున్నారు. కొడుకు మానసిక స్థిమితం బాగా లేకపోవడంతో కొడుకే తల్లిని హత్య చేసి ఉండొచ్చని తెలిపారు. ఫ్లాట్ నుండి దుర్వాసన…
తునికాకు సేకరణ కోసం అడవిలోకి వెళ్లి మిస్ అయిన మహిళ ఆచూకీ లభించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సుబ్బక్కపల్లికి చెందిన బండారు శిరీష గత రెండు రోజుల క్రితం తునికాకు సేకరణకు వెళ్లి అడవిలో వెళ్లింది. అయితే ఆమె కనిపించకుండా పోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ కెమెరా తో గాలింపు చేపట్టారు. ఈరోజు ఉదయం భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి శివారు అడవి ప్రాంతంలో పోలీసులు ఆమెను గుర్తించారు. నీరసంగా ఉండడంతో భూపాలపల్లి ఏరియా…
ప్రజలందరికీ అధికార సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని తెలిపారు. రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. మండల కేంద్రమైన ములుగు అభివృద్ధి కై రూ.10 కోట్లు మంజూరు చేసుకున్నామని అన్నారు. మన ఊరు-మన బడి కింద 7300 కోట్లు వెచ్చించి, ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో తరగతులు ప్రారంభిస్తున్నామని…