Heavy Rains: హైదరాబాద్‌ను వణికిస్తున్న వాన.. పండ్లమార్కెట్‌లో కొట్టుకుపోయిన బత్తాయిలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తోంది. బాటసింగారం పండ్ల మార్కెట్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. మార్కెట్‌లోని దుకాణాలన్నీ తడిసిముద్దయ్యాయి. మార్కెట్ ప్రాంగణంలో నిల్వ ఉంచిన పండ్లన్నీ తడిసిపోయాయి. భారీ వర్షం వల్ల మార్కెట్‌లోకి ప్రవాహం దూసుకొచ్చింది. బత్తాయితో పాటు వివిధ రకాల పండ్లు వర్షం నీటిలో కొట్టుకుపోవడంతో వాటిని కాపాడుకునేందుకు వ్యాపారులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రేలు, నిల్వ చేసిన పండ్లపై టార్పాలిన్లు కప్పి ఉంచారు. బాటసింగారం మార్కెట్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టెంట్లు గాలికి ఎగిరిపోగా.. రేకుల షెడ్లు కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. మార్కెటింగ్ శాఖ కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడ్డిఅన్నారం నుంచి బాటసింగారం హెచ్‌ఎండీఏ లాజిస్టిక్స్ పార్కులోకి తాత్కాలికంగా తరలించిన తర్వాత మార్కెట్ కార్యకలాపాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
మరో వైపు భాగ్యనగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా హైదరాబాద్ నగరం తడిసిముద్దవుతోంది. ట్రాఫిక్ జామ్‌తో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి.రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు అవస్థలు పడ్డారు. మూసాపేట మెట్రో స్టేషన్ కిందికి భారీగా చేరిన వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు వరకు వరద నీరు చేయడంతో రాకపోకలకు అంతరాయం. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో షియర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
- Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
Hyderabad Rains: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. రోడ్లు జలమయం
ఇవాళ, రేపు హైదరాబాద్ సహా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు నగర ప్రజలకు కీలక సూచన చేశారు. ఆగి ఆగి కొడుతున్న వర్షం కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే వర్షం ఆగగానే ఆగమాగం బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు. కొద్ది సమయం తర్వాతే బయటకు రావాలని.. అప్పుడే ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడొచ్చని తెలిపారు. భారీ వర్షాలతో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్‌లో ఇరుక్కపోవచ్చు. కావున కాస్త చూసుకుని బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ప్రజలను కోరుతోంది.
Hyderabad High Alert: హైదరాబాద్ కు కుంభవృష్టి.. హై అలర్ట్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. హఫీజ్ పేట 9.3సెం.మీ, బాలానగర్ 9.2సెం.మీ, గాజుల రామారం 9, బాలాజీ నగర్ 8.7, రాజేంద్ర నగర్ 8.5, హైదర్ నగర్ 8.1, మాదాపూర్ 7, మౌలాలి 6.8, నేరేడ్‌మెట్ 6.7, మైలార్‌దేవ్ పల్లి 6.7, కూకట్ పల్లిలో 6.7సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
తాజావార్తలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
-
Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!