Heavy Rains: తెలంగాణలో వర్షబీభత్సం.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో జోరు వాన కురిసింది. ఏకధాటి వర్షానికి మరోసారి వాగులు, వంకలు ఉప్పొంగాయి. రహదారులపైకి వరద నీరు చేరి.. వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవటంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో షియర్ జోన్ ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండురోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. హైదరాబాద్ నగరంలో రాగల 48 గంటల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో మళ్లీ భారీ వర్షం కురిసింది. గత మూడు రోజులుగా కాస్త పొడి వాతావరణం ఉన్నా మళ్లీ ఇవాళ ఉదయం నుంచి ముసురు కమ్మేసింది. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
Also Read
- TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
- CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
Heavy Rain Lashes Hyderabad: హైదరాబాద్ ని ముంచెత్తిన వర్షం
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. అలాగే వర్షం ఆగగానే ఆగమాగం బయటకు రావద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు. కొద్ది సమయం తర్వాతే బయటకు రావాలని.. అప్పుడే ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడొచ్చని తెలిపారు. భారీ వర్షాలతో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్‌లో ఇరుక్కపోవచ్చు. కావున కాస్త చూసుకుని బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ప్రజలను కోరుతోంది.
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!