తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. భారత దేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందినా.. ఆ ఫలాలు పొందటానికి తెలంగాణ ప్రజలకు మరో 13 నెలలు సమయంపట్టిందని గుర్తుచేశారు.. నిజాం నిరంకుశ పాలనపై భారత ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో సాగిన పోలీస్ యాక్షన్ మూలంగా తెలంగాణకు స్వేచ్ఛ…
Kishan Reddy: నేడు నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ..
సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు.
భారీ వర్షాలతో తెలంగాణలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. రెండు కేంద్ర బృందాలు పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నాయని, NDRF బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు మూడు లక్షల రూపాయలు కేంద్రం సహాయం ప్రకటించిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అత్మగౌరవానికి ప్రతీక సెప్టెంబర్ 17 అని, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను నిర్వహించలేకపోతోందని ఆయన విమర్శించారు. సెప్టెంబర్ 17…
బీఆర్ఎస్ నాయకులారా.. మీరు నిజమైన తెలంగాణ వాదులైతే.. మీ ఒంట్లో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే తక్షణమే ఆ పార్టీని వీడి రండి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు.
Amit Shah: సర్దార్ పటేల్ లేకపోతే.. తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించకపోయేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశమే సర్వస్వమే నినాదంతో.. ఆపరేషన్ పోలోను ప్రారంభించారన్నారు.
Amit Shah: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై దృష్టి సారించింది. ఇప్పటికే.. తెలంగాణకు పలువురు కీలక నేతలను ప్రత్యేక హోదాల్లో నియమించి.. రాష్ట్ర ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.