బీఆర్ఎస్ నాయకులారా.. మీరు నిజమైన తెలంగాణ వాదులైతే.. మీ ఒంట్లో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే తక్షణమే ఆ పార్టీని వీడి రండి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించేందుకు భయపడుతున్న బీఆర్ఎస్ నేతలను చవట దద్దమ్మలు అంటూ ఆయన విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈరోజు పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు.
Read Also: Bigg Boss 7 Telugu : వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా?
ఈ రోజు బీజేపీ కార్యకర్తలకు మూడు పండగలు వచ్చాయని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒకటి తెలంగాణ విమోచన దినోత్సవం అయితే, మరోకటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు, ఇంకోటి విశ్వకర్మ జయంతి అని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది నుంచి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా ప్రజల అభిమతాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాలు జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు దగుల్బాజీ పార్టీలు.. విమోచన దినోత్సవాలను వ్యతిరేకిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు.
Read Also: Kuhasini Gnanaseggaran: రెడ్ సారీ లో అందాలు ఆరబోస్తున్న కుహాసిని జ్ఞానసెగ్గరన్
తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాలను ఎందుకు జరుపుకోవడం లేదని తిట్టిన కేసీఆర్ ఇప్పుడెందుకు స్పందించడం లేదు అని బండి సంజయ్ అన్నారు. ఆ నోరేమైంది? సిగ్గుండాలే… అధికారంలోకి వచ్చాక నిజాం సమాధి ముందు మోకరిల్లిన నీచుడు కేసీఆర్.. అప్పుడే అర్ధమైంది.. తెలంగాణలో మళ్లీ నయా నిజాం పాలన అమలు కాబోతోందని.. ఆనాడు భయపడినట్లే ప్రస్తుతం జరుగుతోంది అని బండి సంజయ్ విమర్శలు గుప్పించాడు.
Read Also: Maharashtra: వాస్తుదోషాల పేరుతో మహిళపై పదేపదే అత్యాచారం..
పాతబస్తీలో నల్ల జెండాలు ఎగరేసి నిరసన తెలిపిన ఒవైసీకి భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించడం లేదు అని బండి సంజయ్ అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో కొత్త రాగం అందుకున్నాడు.. కేసీఆర్ పార్టీ పుట్టక ముందే తెలంగాణ కోసం 1997లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానించిన పార్టీ బీజేపీ.. కేసీఆర్ అంతటి మోసగాడు, దగుల్బాజీ మరొకరు లేరు అని ఆయన విమర్శించారు. మంత్రి పదవి కోసం అజయ్ రావుగా ఉన్న తన కొడుకు పేరును తారక రామారావుగా మార్చిన మోసగాడు కేసీఆర్.. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమ పార్టీ పెట్టి ప్రజలను మోసం చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.