కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని .. భారత దేశం కోసం కాదని బీజేపీ నేత మురళీధర్ రావు అన్నారు. సొంత రాజ్యం ఏర్పాటు కోసం పోరాడారని.. దేశ భక్తితో మాత్రం కాదన్నారు.
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో గుర్తింపు దక్కని ఉద్యమకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిని స్మరించుకొనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం అని నినాదించి జైలుకు వెళ్లిన వందేమాతరం రామచందర్ రావు కుటుంబ సభ్యులను కిషన్ రెడ్డి బేగంబజార్ లో ఆయన కలిశారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన…
తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది భారతీయ జనతా పార్టీ.. వీలైనప్పుడల్లా.. సందర్భం వచ్చినప్పుడల్లానే కాదు.. సందర్భాన్ని క్రియేట్ చేసి మరి తెలంగాణను వచ్చివెళ్తున్నారు బీజేపీ కీల నేతలు.. కేంద్ర మంత్రులు.. ప్రతీసారి ఏదో ఒక రకమైన కొత్త చర్చకు తెరలేపి వెళ్లిపోతున్నారు.. గత పర్యటనలో మునుగోడు సభలో పాల్గొన్న షా.. వెళ్తూ వెళ్తూ.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి భోజనం చేశాసి వెళ్లారు.. ఆ భేటీపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.. ఇక, 15 రోజు…
Telangana Liberation Day on September 17: తెలంగాణకు నిజాం పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవాన్ని భారీగా జరపాలని బీజేపీ నిర్ణయించింది. 2022 సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17వరకు ఏడాది పాటు తెలంగాణ విముక్తి వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో కలపబడి 75 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించనుంది బీజేపీ పార్టీ. 2023 సెప్టెంబర్ 17న…
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. టీఆర్ఎస్ నేతలంతా హుజూరాబాద్ పై దృష్టి పెట్టగా.. కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం తమ తమ రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ముందుకు పోతున్నాయి. ఈ క్రమంలో.. బీజేపీ నేతలు ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం.. ఆయన రాక ఖరారైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన…