హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంపై ధన్యవాదాలు తెలిపారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా.. నిజాం రాక్షస, అరాచక పరిపాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిన సెప్టెంబర్ 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ‘తెలంగాణ విమోచన ఉత్సవాలు’ నిర్వహించడం పై తెలంగాణ మేధావులు, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదములు తెలియజేశారు. 75 మంది మేధావులు, ప్రొఫెసర్లు ఈ లేఖపై సంతకాలు చేస్తూ.. ఏడాదిపాటు అంటే 2023 సెప్టెంబర్ 17 వరకు ఏడాదిపాటు విమోచన వజ్రోత్సవాలను (75 ఏళ్లు) కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం హైదరాబాద్ అమరవీరులను సరైన గౌరవాన్ని కల్పించడమేనని పేర్కొన్నారు.
Read Also: Palakol 1 crore Ammavaru: కోటిరూపాయలతో ధనలక్ష్మి అమ్మవారు
సెప్టెంబర్ 17 నాడు ప్రధానమంత్రి జన్మదినం కావడంతో శుభాకాంక్షలు తెలపడంతోపాటు, తెలంగాణ విమోచన దినోత్సవాలను ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించాలని ఆ లేఖలో వారు కోరారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్, హైదరాబాద్ విమోచన దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి, అధికారులకు కూడా వీరు ధన్యవాదములు తెలిపారు.
Read Also:Udhampur Blast: అమిత్ షా పర్యటన లక్ష్యంగా ఉదంపూర్ జంట పేలుళ్లు: జమ్మూ కాశ్మీర్ పోలీసులు