టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నటి భీమిరెడ్డి శ్రీసుధతో గతంలో అతడు సహజీవనం చేయగా ఆ వ్యవహారం వివాదాస్పదమైంది. తనతో శ్యామ్ కె నాయుడు పెళ్లి పేరుతో ఐదేళ్ల పాటు సహజీవనం చేశాడని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని శ్రీసుధ హైదరాబాద్ ఎస్.ఆర్. నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరగా, శ్యామ్ కె నాయుడుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. Read Also: లతా…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో మహమ్మారి వ్యాప్తి పెరుగుతోంది. తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై డీహెచ్ శ్రీనివాసరావు న్యాయస్థానికి నివేదిక సమర్పించారు. ఇదిలా వుంటే.. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాలు ఇస్తుందని మరోవైపు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఫీవర్ సర్వేలో 3 రోజుల్లోనే 1.70 లక్షల జ్వర బాధితులను గుర్తించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర హై కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 317 పై తాము స్టే ఇవ్వలేమని తెలంగాణ రాష్ట్ర హై కోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే ఒకసారి తెలంగాణ హై కోర్టు జీవో నెంబర్ 317 పై ఇలాగే స్పందించింది. తాజాగా ఈ రోజు కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయిపుల పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఈ విధంగా…
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో RT-PCR పరీక్షలు పెంచాలని హైకోర్టు ఆదేశించింది. రోజుకు లక్ష టెస్టులు చేయాలని సూచించింది. RT-PCR, ర్యాపిడ్ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించేలా చూడాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు…
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి అడుగడుగా అడ్డంకులు తప్పట్లేదు. ఇప్పటికే సినిమాను కరోనా కారణంగా 4 సార్లు వాయిదా వేశారు మేకర్స్. అయితే తాజాగా ఈ సినిమాకు మరో కష్టం వచ్చింది. ఈ చిత్రం విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతా రామరాజు,…
తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. కరోనా, ఒమిక్రాన్ కేసులపై విచారణ జరిపింది హైకోర్టు.. నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు పిటిషనర్స్.. ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని కోరారు.. ఇంత వరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. Read…
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెన్నమనేని తరపున హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. సిటిజన్ షిప్ యాక్ట్‌పై ఆయన కోర్టుకు వివరణ ఇచ్చారు. పౌరసత్వం రద్దు చేయాల్సిన అధికారం సెక్రటరీ, బార్డర్ మేనేజ్మెంట్ మాత్రమే ఇవ్వాలని.. కానీ ఈ కేసులో అండర్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కోర్టుకు వివరించారు. ఇది చట్ట విరుద్ధమని వేదుల వెంకటరమణ కోర్టులో వాదించారు.…
తెలంగాణలో గురుకుల టీజీటీ పోస్టుల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా గురుకుల టీజీటీ పోస్టుల భర్తీ విషయంలో బీటెక్ అభ్యర్థుల అర్హత విషయంపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీఈడీ చేసిన బీటెక్ విద్యార్థులు గురుకుల టీజీటీ పోస్టులకు అర్హులే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. Read Also: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాస్ చేసేందుకు విద్యాశాఖ యోచన..? మరోవైపు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. బీఈడీ…
తెలంగాణ గ్యాంగ్స్టర్గా చెలామణి అయిన నయీం జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘నయీం డైరీస్’ చిత్రానికి హైకోర్టులో చుక్కెదురైంది. నయీం డైరీస్ మూవీలో అసభ్యకర దృశ్యాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారురాలు బెల్లి లలిత కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అభ్యంతకర సన్నివేశాలు తొలగించేవరకు సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. Read Also: ఫ్యామిలీతో రజినీకాంత్ బర్త్ డే సెలెబ్రేషన్స్… పిక్స్ వైరల్ అయితే…
గత కొన్ని రోజులు ఏపీలో సినిమా టికెట్ల ధరల చుట్టూ చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ప్రభుత్వం టికెట్ల ధరను తగ్గించడం మాత్రమే కాకుండా బెనిఫిట్ షో లను రద్దు చేస్తూ కేవలం రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలని స్పష్టం చేసింది. అలాగే టికెట్లు కూడా ఆన్లైన్ లో విక్రయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ ఇది ఏపీలో కాదు.. తెలంగాణలో. తాజాగా…