చెన్నమనేని కేసుపై తెలంగాణ హైకోర్టులో కీలక వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెన్నమనేని తరపున హైకోర్టు సీనియర్ కౌన్సిల్ వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. సిటిజన్ షిప్ యాక్ట్‌పై ఆయన కోర్టుకు వివరణ ఇచ్చారు. పౌరసత్వం రద్దు చేయాల్సిన అధికారం సెక్రటరీ, బార్డర్ మేనేజ్మెంట్ మాత్రమే ఇవ్వాలని.. కానీ ఈ కేసులో అండర్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని కోర్టుకు వివరించారు. ఇది చట్ట విరుద్ధమని వేదుల వెంకటరమణ కోర్టులో వాదించారు.
Read Also: ఫ్యాక్ట్ చెక్: డిసెంబర్ 31 వరకు భారత్ బంద్
Also Read
సెక్షన్ 10,(2) ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పౌరసత్వం రద్దు చేసే అధికారాలున్నాయని న్యాయవాది వేదుల వెంకటరమణ తెలిపారు. కానీ పిటిషనర్‌కు అందులో ఉన్న ఏ అంశాలు కూడా వర్తించవన్నారు. చెన్నమనేని టెర్రరిస్ట్ కాదని, సంఘ విద్రోహ శక్తి కాదని సెక్షన్ 10(2) వర్తించదని స్పష్టం చేశారు. చెన్నమనేని సెక్షన్ 5 కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తులో ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వేదుల వెంకటరమణ కోర్టుకు వివరించారు.
ఈ సందర్భంగా ఓవర్ సిస్ ఇండియన్ (OCI) సిటిజన్‌కు భారత దేశంలో ఎమ్మెల్యే, ఎంపీగా ఫొటో చేసే అధికారం ఉంటుందా అని హైకోర్టు ప్రశ్నించింది. OCI మీద ఎలాంటి పోటీ చేసే అధికారం లేదన్న ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు కోర్టుకు తెలిపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చెన్నమనేని గెలిచారని న్యాయవాది వేదుల వెంకటరమణ గుర్తుచేశారు. నాలుగు సార్లు దురదృష్టవశాత్తు జర్మనీ పాస్‌పోర్టు మీద గెలిచారన్నా ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవి కిరణ్ రావు వాదించారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!