తెలంగాణలో గురుకుల టీజీటీ పోస్టుల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్రంలో కొద్దిరోజులుగా గురుకుల టీజీటీ పోస్టుల భర్తీ విషయంలో బీటెక్ అభ్యర్థుల అర్హత విషయంపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీఈడీ చేసిన బీటెక్ విద్యార్థులు గురుకుల టీజీటీ పోస్టులకు అర్హులే అని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
Read Also: ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాస్ చేసేందుకు విద్యాశాఖ యోచన..?
మరోవైపు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. బీఈడీ చేసిన బీటెక్ అభ్యర్థులను టీజీటీ పోస్టుల్లోకి తీసుకోవాలని సంబంధిత అధికారులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో గురుకుల టీజీటీ పోస్టుల నియామకాలను చేపట్టాలని బోర్డును ఆదేశించింది. కాగా హైకోర్టు వెల్లడించిన తీర్పు పట్ల బీటెక్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.