తెలంగాణ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. కరోనా, ఒమిక్రాన్ కేసులపై విచారణ జరిపింది హైకోర్టు.. నూతన సంవత్సర వేడుకలపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు పిటిషనర్స్.. ఒమిక్రాన్ కేసులు గుర్తించి కంటైన్మెంట్ జోన్, మైక్రో కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించాలని కోరారు.. ఇంత వరకు ప్రభుత్వం ఎలాంటి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయలేదంటూ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు..
Read Also: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో తహసీల్దార్ రచ్చ.. అమ్మాయిలతో స్టెప్పులు
ఇక, ఈ నెల 21, 27తేదీల్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ గైడ్ లెన్స్ ను తప్పకుండా పాటించాలని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.. మరోవైపు, కోవిడ్ టెస్టులను పెంచడంతో పాటు సరిపడా బెడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్న న్యాయస్థానం.. రాష్ట్రంలో ఒమిక్రాన్ పరిస్థితులపై జనవరి 3వ తేదీలోగా హైకోర్టుకు నివేదిక అందజేయాలని ఆదేశించింది.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.