తెలంగాణ హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచారానికి గురైన బాలిక దాల్చిన గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. పిండం హక్కుల కంటే.. అత్యాచార బాధితురాలికి రాజ్యాంగం కల్పించిన హక్కులే ప్రాధాన్యమని స్పష్టం చేసింది. అత్యాచారానికి గురైన బాలిక అబార్షన్‌కు హైకోర్టు అంగీకరించింది. 26 వారాల పిండాన్ని తొలగించేందుకు అనుమతి ఇచ్చింది. కోఠి ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు హైకోర్టు ఇందుకు సంబంధించి ఆదేశాలు జారీచేసింది. నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ఈ కీలక…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం అయినప్పటి నుంచి.. ఎదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అయితే.. తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనుల పై హైకోర్టులో పిల్ దాఖలైంది. సిద్ధిపేట జిల్లా తుక్కాపూర్ కు చెందిన శ్రీనివాస రెడ్డి పిల్ దాఖలు చేశారు. మూడో టీఎంసీకి అనుమతుల్లేకుండా పనులు చేపట్టారని పిల్ పేర్కొన్నాడు పిటిషనర్ శ్రీనివాస రెడ్డి. కేంద్రం, ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా…
హైదరాబాద్ కొత్తపేటలోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ఇవాళ అర్ధరాత్రి నుంచి మూతపడనుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్కెట్ మూసివేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మార్కెట్‌ను బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలిస్తున్నారు. అయితే.. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై హైకోర్టును ఆశ్రయించారు పండ్ల వ్యాపారులు.. ఈ నెల 25 నుండి మార్కెట్ క్లోజ్ చేస్తునట్టు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో కోర్టు మెట్లెక్కారు.. కొహెడలో నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసే వరకు బాట సింగారంలో…
గణేశ్ ఉత్సవాల నిర్వాహణపై తెలంగాణ హై కోర్టు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం పై ఆంక్షలు హైకోర్టు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తమ ఆంక్షలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్‌సాగర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని ఆదేశించింది. ప్రత్యేక కుంటల్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ విగ్రహాలు నిమజ్జనం చేయాలని… హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా…
విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేసారు ప్రైవేట్ ఉపాధ్యాయుడు బాలకృష్ణ. ప్రి ప్రైమరీ, ప్రైమరీ తరగతులకూ ప్రత్యక్ష బోధన ఆందోళన కలిగిస్తోందన్నారు పిటిషనర్. కరోనా మూడో దశ ముప్పు ఉన్నందున ప్రత్యక్ష బోధన సరికాదన్నారు పిటిషనర్. ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టును కోరారు పిటిషనర్. పిల్ పై ఈ నెల 31న విచారణ చేపట్టనున్నారు తాత్కాలిక సీజే జస్టిస్ రామచంద్రరావు ధర్మాసనం. అయితే కరోనా…
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బదిలీ కావడంతో.. హైకోర్టు సీజే పోస్టు ఖాళీ ఏర్పడింది.. దీంతో.. ఎంఎస్ రామచంద్రరావును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్ర న్యాయశాఖ. తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయిలో కొత్త ప్రధాన న్యాయమూర్తి వచ్చే వరకు.. బాధ్యతలు నిర్వహించనున్నారు ఎంఎస్ రామచంద్రరావు. కాగా, సుప్రీంకోర్టుకు కొత్తగా 9…
ఉన్నతాధికారులపై కోర్టు ధిక్కరణ ఉత్తర్వులను తెలంగాణ హై కోర్టు కొట్టేసింది. ఓ కేసుకు సంబంధించి అటవీ శాఖ ఉన్నతాధికారులతో పాటు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు విధించిన శిక్ష కేసుకు సంబంధించి అప్పీల్ కు అనుమతి ఇస్తూ, కోర్టు ధిక్కరణ ఉత్తర్వులను హై కోర్టు కొట్టి వేసింది. సింగిల్ జడ్డి ఇచ్చిన ఉత్తర్వులపై అధికారులు అప్పీల్ చేసుకునేందుకు చీఫ్ జస్టిస్ తో కూడిన ద్వి సభ్య బెంచ్ అనుమతించింది. 2009 కి చెందిన ఓ కేసులో కోర్టు…
కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇప్పుడు రైతుల కూడా ఎంట్రీ ఇచ్చారు.. కృష్ణాజలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ తెలంగాణ హైకోర్టుకెక్కారు ఏపీ రైతులు.. కృష్ణా జిల్లాకు చెందిన రైతులు గూడవల్లి శివరామ కృష్ణ ప్రసాద్, ఎమ్. వెంకటప్పయ్య హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.. కేంద్ర జలవనరులశాఖ, కేఆర్ఎంబీ, తెలంగాణ జెన్ కో, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు, ఏపీ ఇరిగేషన్ శాఖలను ప్రతివాదులుగా…
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య భారీగా పెరిగింగి.. ఏకంగా న్యాయమూర్తుల సంఖ్య 75 శాతం పెంచారు.. దీంతో.. హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కి పెరిగింది. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరుతూ తెలంగాణ హైకోర్టు నుంచి గత రెండేళ్లుగా సుప్రీంకోర్టుకు అనేక విజ్ఞప్తులు అందగా.. దీనికి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు.. హైకోర్టు న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు కొలీజియం ద్వారా జరుగుతుండగా.. వివిధ రాష్ట్రాల హైకోర్టుల…
కోవిడ్ థర్డ్ వేవ్ కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రణాళిక… అలాగే చిన్న పిల్లలకు సంబంధించి వ్యాక్సినేషన్ ప్రణాళిక సమర్పించాలి అని టీఎస్ హైకోర్టు తెలిపింది. అయితే మహారాష్ట్రలో లో ఉన్న పరిస్థితులు తెలంగాణ లేవు. కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంక్షేమం, రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అందజేస్తున్న కిట్ లలో స్టెరాయిడ్స్ లేకుండా చూసుకోవాలి…