ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వచ్చే ఏడాది ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ రూ.150 కోట్లు మంజూరు చేసింది.
HMDA: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విలువైన భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) తాజాగా ఈ-వేలం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్ లేఅవుట్లో మొత్తం 12 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాచుపల్లి లేఅవుట్లో 70 ప్లాట్లు, అలాగే రంగారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 4 ప్లాట్లు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మరో 7 ప్లాట్లు వేలం ద్వారా అమ్మకానికి ఉంచనున్నట్లు హెచ్ఎండీఏ…
Ponnam Prabhakar : వర్షాల కారణంగా రింగ్ రోడ్డులోపల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని లక్ష్యంగా మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాత్కాలిక ట్రాఫిక్ ఇబ్బందులు తప్ప ఇతర పెద్ద సమస్యలు లేవని తెలిపారు. ఏ విభాగమైనా సరే సమన్వయంతో పనిచేస్తే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పారు. ప్రభుత్వం ఎంతటి చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం కూడా అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఆకస్మిక…
Chiranjeevi : మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు ఇచ్చింది. స్పోర్ట్స్ హబ్ వైస్ చైర్మన్ గా ఉపాసనను నియమించారు సీఎం రేవంత్. దీంతో ఉపాసనకు చాలా మంది విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. నా కోడలు ఉపాసన ఇప్పుడు స్పోర్ట్స్ హబ్ కో-చైర్మన్ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు గర్వకారణమే కాదు.. ఎంతో ఆనందం కూడా. ఉపాసనకు నీకున్న కమిట్ మెంట్, పాషన్ తో…
Upasana : మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కీలక బాధ్యతలు అందుకున్నారు. ఆమెను తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు కో-ఛైర్మన్ గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపింది ఉపాసన. ఉపాసన సోషల్ యాక్టివిటీస్ లో చురుగ్గా పాల్గొంటుంది. ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తూ హెల్త్ పరంగా అందరికీ చాలా విషయాలు చెబుతోంది. అపోలో హాస్పిటల్స్…
రాబోయే ఐదు రోజుల్లోనే రైతులకు ధాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి బాట కార్యక్రమంలో పాల్గొన్న రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులని పొందుపరిచామని వెల్లడించారు.
Minister Thummala: తెలంగాణలో ఖమ్మం జిల్లాతో సహా పలు ప్రాంతాల్లో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎంసీఆర్హెచ్ఆర్డీని దేశంలోనే అత్యుత్తమ శిక్షణ సంస్థగా నిలపాలని ఆకాంక్షించారు. దీనికి ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. సంస్థ స్వయం సమృద్ధి సాధించి, ఆర్థికంగా పురోగమించాలని సూచించారు.
Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఫిక్స్డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలందిస్తున్న 12,055 మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వారి సేవలను పొడిగిస్తూ అధికారికంగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వులు) జారీ చేసింది.…
హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సినిమాని ఆదరించి ఇష్టపడే ప్రతి ఒక్కరికి, టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, శిల్పకళా వేదిక నుంచి మా హృదయపూర్వక నమస్కారాలు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ఫంక్షన్ హైదరాబాద్, తెలంగాణలో కనీసం లక్షలాది మంది మధ్య జరుపుకుందాం అని ప్లాన్ చేసినా, వర్షాభావాలు, ఇతర కారణాలవల్ల ముందుకు తీసుకెళ్లలేక ఫంక్షన్ సైజుని శిల్పకళా వేదికకు…