రైతులకు రెవెన్యూ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. తెల్లకాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం 9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే ఛాన్స్ ఉంది.
READ MORE: Mouli Tanuj : మౌళికి బంగారం లాంటి అవకాశం.. కాపాడుకుంటే తిరుగులేదు..
రాష్ట్రంలోని పట్టణాలు మినహా ఇతర ప్రాంతాల్లో 2014 జూన్ రెండో తేదీ ముందు వరకున్న సాదాబైనామా కొనుగోళ్లను.. 2016లో నాటి ప్రభుత్వం తొలిసారిగా క్రమబద్ధీకరించింది. అప్పట్లో 12.64 లక్షల దరఖాస్తులు రాగా.. పరిశీలన అనంతరం 6.18 లక్షల మేర క్రమబద్ధీకరించారు. రెండోసారి 2020లో క్రమబద్ధీకరణకు అవకాశమిస్తూ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. కానీ ఆర్వోఆర్-1971ను సవరించి తెచ్చిన ఆర్వోఆర్-2020 చట్టంలో క్రమబద్ధీకరణకు సెక్షన్లు చేర్చలేదు. పైగా 2020 చట్టం అమలులోకి రావడానికి ముందు, ఆ తరువాత దరఖాస్తులను స్వీకరించడం న్యాయ వివాదానికి దారితీసింది. 1971 నాటి చట్టం అమల్లో ఉన్నప్పుడు తీసుకున్న దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలనుకున్నా ఈ ప్రక్రియ మొత్తం నిలిచిపోయింది. అప్పుడు వచ్చిన దరఖాస్తులు 9.89 పెండింగులో ఉన్నాయి.
READ MORE: Super Six Super Hit: ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభ.. అసలు ఉద్దేశం అదేనా..?