Aarogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలనే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, గతంలో రూ. 5 లక్షలుగా ఉన్న ఉచిత వైద్య పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. అలాగే, ప్రైవేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలపై దృష్టి సారించి, గత 21 నెలల్లో రూ. 1779 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా, దశాబ్ద కాలంగా పెంచని వైద్య చికిత్సల ప్యాకేజీల చార్జీలను సగటున 22% పైగా పెంచింది. కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చింది. ఈ నిర్ణయం ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. దీని కోసం ప్రభుత్వం అదనంగా రూ. 487.29 కోట్లు ఖర్చు చేస్తోందని ఆయన అన్నారు.
North Korea: కిమ్ కోపానికి కరిగిపోయిన ఐస్ క్రీం.. దెబ్బకు పేరు మారిపోయింది…
2014 నుంచి 2023 నవంబర్ వరకు నెలకు సగటున రూ. 57 కోట్లు చెల్లించగా, 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు నెలకు రూ. 75 కోట్లు చెల్లించామని సీఈవో తెలిపారు. ప్రస్తుతం నెలకు రూ. 95 కోట్లు చెల్లిస్తున్నామని, ఆసుపత్రుల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఈ మొత్తాన్ని నెలకు రూ. 100 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఆయన వెల్లడించారు. హాస్పిటల్స్ యాజమాన్యాల ఇతర విజ్ఞప్తుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు.
Arab-Islamic Nato: అరబ్-ఇస్లామిక్ సైనిక కూటమి కోసం టర్కీ, పాక్ ఒత్తిడి.. ఇజ్రాయిలే టార్గెట్..