IAS Transfers: హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఐఏఎస్ (IAS) అధికారులను, నాన్-కేడర్ అధికారులను బదిలీ చేస్తూ.. కొందరికి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (SPL.A) డిపార్ట్మెంట్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం జరిగిన బదిలీలు, పోస్టింగ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. Zepto: చిక్కడపల్లిలో జెప్టో డెలివరీ బాయ్స్ వీరంగం.. కస్టమర్‌పై మూకుమ్మడి దాడి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న…
Aarogyasri: ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలనే ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా, గతంలో రూ. 5 లక్షలుగా ఉన్న ఉచిత…
Bhatti Vikramarka: వస్తువులు, సేవల పన్ను (GST) రేట్ల సవరణ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ట్రేడర్స్ అసోసియేషన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జీఎస్టీ పన్నుల తగ్గింపు, దాని ప్రయోజనాలు ప్రజలకు ఎలా చేరాలనే అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గించడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలందరికీ అందాలని స్పష్టం చేశారు. Hyderabad: రాజేంద్రనగర్‌లో మహిళ దారుణ హత్య.. అత్యాచారం చేశారా? విధానపరమైన నిర్ణయాలు ఎన్ని…
Arogyasri: తెలంగాణ రాష్ట్రంలో నేటి అర్ధరాత్రి (సెప్టెంబర్ 16) నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ వదిరాజు రాకేష్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 323 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై డాక్టర్ వదిరాజు రాకేష్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల…
రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ (యూఎస్సీ) నిధుల కోసం ఆందోళన చేస్తున్న ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ప్రభుత్వంతో జరిగిన చర్చల అనంతరం తమ బంద్‌ను విరమించుకున్నాయి.
రాష్ట్రంలో కుల ధ్రువీకరణ పత్రాలను పొందడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్లు పొందడానికి దరఖాస్తు చేసి, ఎమ్మర్వో ఆమోదం కోసం వేచి చూడాల్సి వచ్చేది.
రైతులకు రెవెన్యూ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. తెల్లకాగితాలపై రాసుకున్న భూ కొనుగోళ్ల ఒప్పందాల (సాదాబైనామా) క్రమబద్ధీకరణకు ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదలైంది. సాదాబైనామా క్రమబద్ధీకరణ కోసం 9.89 లక్షల మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 11 లక్షల ఎకరాల భూములకు 13-బీ ప్రొసీడింగ్స్ జారీ అయ్యే ఛాన్స్ ఉంది.
Telangana Joint Staff Council Appointed: ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసింది. ఈ మేరకు తొమ్మిది ఉద్యోగ సంఘాలకు గుర్తింపు లభించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నియామకం చేపట్టింది. అందులో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ తో పాటు మరికొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. మరో ఆరు సంఘాలకు రొటేషన్ పద్దతిలో ఆహ్వానించనుంది.