Arogyasri: తెలంగాణ రాష్ట్రంలో నేటి అర్ధరాత్రి (సెప్టెంబర్ 16) నుంచి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. నెట్‌వర్క్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ వదిరాజు రాకేష్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 323 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై డాక్టర్ వదిరాజు రాకేష్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ భారంగా మారిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లిస్ట్‌లో పేర్లు తొలగించారని నిరసన.. వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళల!
ఇక ఆసుపత్రుల ప్రధాన డిమాండ్లు చూస్తే.. ఆసుపత్రులకు సంబంధించిన రూ. 1400 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే ఆరోగ్యశ్రీ సేవల బిల్లులను 40 రోజుల్లోగా చెల్లించాలని కోరారు. అలాగే ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కోర్ కమిటీలో వైద్యులను చేర్చాలని.. తద్వారా ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా చర్చించి పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే, ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించే అవకాశం లేదని డాక్టర్ రాకేష్ తేల్చి చెప్పారు. ఈ పరిణామం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.