CM Revanth Reddy : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, సినీ పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ప్రముఖ నిర్మాత, టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఈ రేపు సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సినీ ప్రముఖులతో కలిసి భేటీ కావాలని దిల్ రాజు ప్రకటించారు. అయితే.. తాజాగా రేపు ముఖ్యమంత్రి…
ప్రతి మహిళను మహాలక్ష్మిగా గౌరవిస్తామని.. వారిని కోటీశ్వరులుగా తయారు చేస్తామని.. ఇదే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
తెలంగాణ రైజింగ్.. ఆ కోణంలో బ్యాంకర్లు దీర్ఘ దృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో జరిగిన బ్యాంకర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు వచ్చాయని.. త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన తెలిపారు.
Mission Bhagiratha : పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలతో ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ హెడ్ ఆఫీస్ లో కాల్ సెంటర్ ప్రారంభించారు. సోమవారం నుంచి మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4007 అందుబాటులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులపై ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. సూపరిండెంట్ ఇంజనీర్ నేతృత్వంలో ఐదుగురు సిబ్బందితో 24 గంటలు పనిచేయనున్న…
Harish Rao : క్రిస్మస్ను అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ప్రతి క్రిస్మస్కు పేద క్రిస్టియన్ సోదరులకు గిఫ్ట్‌లు అందించడం ప్రత్యేకమైనది అని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులపై కేసీఆర్ చేసిన ప్రయత్నాలు, ఎంత బాగా చూసుకున్నారో అందరికీ తెలుసని చెప్పారు. మెదక్ చర్చి వందేండ్లు పూర్తి అవడాన్ని పురస్కరించుకుని హరీష్ రావు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన…
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చినట్టుగా ఇక మీదట సినిమాలకు బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇచ్చేది లేదని తేల్చేసింది. తాజాగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు అసెంబ్లీలో ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలు సంధ్య థియేటర్ తొక్కిసలాట అంశం మీద ముందు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఒక సినీ హీరోని అరెస్ట్ చేస్తే అందరూ రాద్ధాంతం చేశారంటూ ఆయన…
TG Rythu Bharosa: సంక్రాంతికి రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో ఇవాళ అసెంబ్లీలో రైతు భరోసా అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఆతరువాత సీఎం రేవంత్ ఓ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. రైతు భరోసా నిధులను వచ్చే సంక్రాంతి నాటికి అన్నదాతాల ఖాతాలో జమచేస్తామని ముఖ్యమంంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో అసెంబ్లీలో చర్చించి దీనిపై ఓ ప్రకటన విడుదల చేయనున్నారు.…
అదానీ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లు చూసి ఊసరవెల్లి సిగ్గుపడుతుందని.. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజ్‌భవన్ ముట్టడిలో కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని.. మేము రేవంత్ రెడ్డి, అదానీ ఫోటోతో అసెంబ్లీకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారన్నారు.
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండని ఆయన విమర్శించారు. మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తే, ఆటో సర్వీసులకు ప్రభావం పడుతుందని చెప్పడం తప్పని…