KTR : ఫార్ముల ఈ రేస్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక పాత సామెత చిన్నప్పటి నుంచి వింటున్నామని, అవినీతి పరులు ప్రతిచోటా అదే జరుగుతుంది అనుకుంటారన్నారు. ఉదయం నుంచి కాంగ్రెస్ నాయకులు ఏదో హడావుడి చేస్తున్నారని, ఏమి లేకున్నా నా మీద లొట్టపీసు కేస్ పెట్టారని ఆయన విమర్శించారు. అవినీతి లేదని తెలిసి కూడా నామీద కేసు పెట్టి శునకానందం పొందతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రాజ్యాంగపరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటా అని ఆయన స్పష్టం చేశారు. నా మీద కేస్ పెట్టిన చిట్టి నాయుడు కి ఒక విషయం చెప్పాలని, నేను ఏసీబీ ఆఫీసుకు వెళ్లినా నన్ను ప్రశ్నించడానికి భయపడ్డారన్నారు. మేము కోర్టు కు వెళ్ళామని, హై కోర్టులో మేము వేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేశారన్నారు. మేము సుప్రీంకోర్టు కు వెళ్ళామని, రెండు మూడు రోజుల్లో విచారణ కు వస్తుందన్నారు.
New orleans: న్యూ ఓర్లీన్స్ నిందితుడి వీడియో విడుదల.. దాడికి ముందు ఏం చేశాడంటే..!
నేను విచారణ కు వెళితే లాయర్ల ను తీసుకెళ్తానని, అందుకోసం రేపు హై కోర్టు కు వెళ్తున్నానని ఆయన పేర్కొన్నారు. కొందరు మంత్రులు న్యాయ మూర్తుల లాగా మాట్లాడుతున్నారని, రేపు హై కోర్ట్ అనుమతి ఇస్తే ఎల్లుండి లాయర్ల తో కలిసి విచారణ కు వెళ్తానని కేటీఆర్ వెల్లడించారు. ఈడీ విచారణ కు కూడా వెళ్తానని, హై కోర్టు నేను తప్పు చేశాను అని చెప్పలేదన్నారు కేటీఆర్. కేవలం విచారణ చేయమని చెప్పారని, ఈ విషయం పై అసెంబ్లీ లో చర్చ పెట్టమంటే పెట్టలేదన్నారు. నువ్వు మగాడి వి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో చర్చ పెట్టు వస్తానని సవాల్ విసిరారు కేటీఆర్. ఆయన ఫార్ములా ఈ రేస్ కేస్ గురించి మాట్లాడుతున్నారు.. మేము ఫార్మర్స్ గురించి మాట్లాడుతున్నామన్నారు కేటీఆర్. నా మీద ఎన్ని కక్ష సాధింపు చేసినా ఏమి చేయలేడన్నారు.
Heart Attack: గుండెపోటుతో 8 ఏళ్ల బాలిక మృతి.. స్కూల్‌లోనే కుప్పకూలిన చిన్నారి..