MLC Kavitha: బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీ మీడియా పాయింట్లో చేసిన ప్రెస్ మీట్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఆమె మాట్లాడుతూ, “మేము మండలిలో అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తప్పుడు సమాధానాలు ఇస్తోందని, నిన్న రాత్రి జరిగిన మూసీ ప్రాజెక్టు విషయాన్ని మంత్రి శ్రీధర్ బాబు తప్పుదోవ పట్టించారని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచి మూసీ కోసం డబ్బులు అడగలేదని శ్రీధర్ బాబు చెబుతున్నారు. కానీ, సెప్టెంబర్ 2024లో…
హాస్టల్ విద్యార్థులకు మెనూను మార్చేశామని.. ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు ఇస్తామని.. ప్రతి నెలా చెకప్ చేయిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదల కష్టాలు ఏంటో మాకు తెలుసన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు ఛార్జీలు పెంచామన్నారు. ముఖ్యమంత్రి, అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం 40 శాతం వరకు విద్యార్థులకు అందించే ఛార్జీలు పెంచామన్నారు
ఈ-ఫార్ములా కార్ రేసింగ్ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని అన్ని సమస్యలపై చర్చించేందుకు సిద్ధమని వెల్లడించారు. కేబినెట్లో మాట్లాడటం సరికాదని.. సభలో చర్చ చేద్దామంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ-కార్ రేసింగ్పై విచారణకు గవర్నర్ ఆమోదంపై కేటీఆర్ తొలిసారి స్పందించారు.
గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలతు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోలేదని.. చంద్రబాబు రాగానే ఏపీకి పోతుంది అనేది ప్రచారం మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో వరద వల్ల ఏపీకి ఇన్వెస్ట్మెంట్ వెళ్లే పరిస్థితి లేదన్నారు. అమరావతిలో వరద వల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు భయం పట్టుకుందని మంత్రి అన్నారు.
తమ భూమి తమకే ఉండాలని కొట్లాడిన పాపానికి లగచర్ల రైతులను జైల్లో పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారన్నారు. లగచర్ల ఘటనపై చర్చ పెడదాం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.
Minister Seethakka : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఆలయ పాలక వర్గం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పరిగి ,కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ లతో ప్రమాణ స్వీకారం చేయించారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీతక్క మాట్లాడుతూ రైతు వ్యవసాయ మానేస్తే కుక్కకు కూడా అన్నం దొరకదని అన్నారు. అదేవిధంగా పేదింటి బిడ్డలు సన్న…
Boora Narsaiah Goud: తెలంగాణ ప్రగతి, ప్రతిష్ట తిరోగమనంలో పయనిస్తోందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ అంటే ఫాస్టెస్ట్ గగ్రోయింగ్ సిటీ అనే పేరు ఉండేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక 6 మోసాలు.. 66 అబద్ధాలు అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు బూర నర్సయ్య. గల్లీలో తిట్లు.. ఢిల్లీలో మెట్లు.. దేవుళ్లపై ఒట్లు.. సర్కార్ దీనికే పరిమితమైందని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదలు ఇప్పటి…
Harish Rao : ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన సీఎం రేవంత్.. ఈనెల 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ నోట్ విడుదల చేశారు. 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి ఉంది ఆయన పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో మీరు సాధించిన ఘనత…
Minister Seethakka : గత ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీని ట్రబుల్ ఐటీగా మార్చిందని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇవాళ ఆమె నిర్మల్లో మీడియాతో మాట్లాడుతూ.. మసగ బారిన ట్రిపుల్ ఐటీ ప్రతిష్టను ఉన్నత స్థితికి తీసుకెళ్లుతామన్నారు. తక్షణ అవసరాల కోసం కోటి రూపాయల నిధులు కేటాయించామని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు పలు సమస్యలను అదృష్టం తీసుకొచ్చారని, వాటన్నింటినీ వీలైనంత తొందరగా పరిష్కరిస్తామన్నారు మంత్రి సీతక్క. ఫుడ్ కాంట్రాక్టర్ డ్రైనేజీ లాప్టాప్ విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయని,…