Alleti Maheshwar Reddy: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని, తాజా క్యాబినెట్ నిర్ణయాలు నిరాశకు గురిచేసినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా పథకంపై స్పష్టత లేకపోవడం, పెన్షన్ పెంపు, ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: DaakuMaharaaj : మామ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లుడు
మహేశ్వర్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయాన్ని “కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుతో సమానమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అవినీతిచర్యలపై విచారణ జరపకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య “డూప్ ఫైట్” జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, హెటిరో స్కాంలో కోట్లాది రూపాయలు చేతులు మారిన విషయం, సివిల్ సప్లై వ్యవహారాల్లో అక్రమాలపై ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వం నిర్ణయాలపై స్పందించకపోవడం వంటి అంశాలపై ఆయన ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి కంపెనీ వ్యవహారంపై, సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ టెండర్లపై తప్పులపై కూడా స్పందించారు. మహేశ్వర్ రెడ్డి ఇవన్నీ ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల హక్కుల కోసం పోరాడే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.