KTR : ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత, ఆ తీర్పుపై న్యాయ నిపుణులతో సలహాలు తీసుకుని సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించుకున్నారు.
Moto G05 Launch: సరికొత్త ఫీచర్లతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసిన మోటోరొలా
ఇదే సమయంలో, ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న నేపథ్యంలో, తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ పిటిషన్‌ను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్‌గా దాఖలు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో పరిస్థితులు గంటగంటకూ మారిపోతున్న నేపథ్యంలో, రాష్ట్ర రాజకీయాల్లో ఇది మరింత హాట్ హాట్ టాపిక్‌గా మారింది.
Raghunandan Rao : ఈ దాడి రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ ప్లానే