KTR : హైదరాబాద్ నగర అభివృద్ధి, రియల్ ఎస్టేట్ పరిస్థితి, ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో నగరం సౌభాగ్యంగా ఎదిగిందని, కానీ 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభాగ్యంగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్…
తెలంగాణలో పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందా? అందుకే ఇక స్పెషల్ ఫోకస్ పెట్టాలని అనుకుంటోందా? జిల్లా పార్టీ అధ్యక్షుల్ని ఢిల్లీ ఎందుకు పిలిచారు? గతానికి భిన్నంగా ఇప్పుడు వాళ్ళని నేరుగా పిలవడం వెనకున్న వ్యూహం ఏంటి? అధికారంలో ఉండి కూడా అంత ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం వెనకున్న సీక్రెట్ ఏంటి? హై కమాండ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పిలుపు వచ్చింది. ఈనెల 27న…రమ్మని వర్తమానం పంపారట పార్టీ పెద్దలు. సడన్గా…
తెలంగాణ కాంగ్రెస్లో నిశ్శబ్దం బద్దలైందా? ఇన్నాళ్ళు నాకెందుకులే…. అది నా పని కాదని అన్నట్టుగా ఉండే వాళ్ళు యాక్టివ్ అయ్యారా? అసెంబ్లీ సాక్షిగా నాయకుల్లో మార్పు కనిపించిందా? అధికార పక్షం ఇక దూకుడు పెంచబోతోందా? పార్టీలో వచ్చిన మార్పు ఏంటి? దానిపై జరుగుతున్న చర్చ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎన్ని కుమ్ములాటలు ఉన్నా…. గ్రూపులు కట్టినా….ఓవరాల్గా పార్టీ, ప్రభుత్వం మీదికి ఎవరన్నా దాడికి దిగితే… అంతా ఏకతాటి మీదికి వస్తుంటారు. కానీ… ఈ మధ్య కాలంలో…
బడుగు బలహీనర్గాలకు న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ఆరె కటిక మహసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు." కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆరె కటికల పాత్ర ఉంది. బడుగు బలహీనర్గాలకు న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడొ యాత్ర చేపట్టారు. బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందాలని కుల సర్వే జరగాలనేది రాహుల్ గాంధీ ఆశయం.
Vijayashanti : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా అధికారికంగా విడుదలైంది. ఈ జాబితాలో అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, , విజయశాంతి పేర్లు ఖరారు చేయబడ్డాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయాన్ని తీసుకుని, అధికారికంగా టికెట్లు అందజేసింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పేరు ప్రకటించబడిన తర్వాత, ఈ విషయంపై విజయశాంతి మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి తనకు కేటాయించారా లేదా అనే అంశం తనకు తెలియదని, కాంగ్రెస్ అధిష్ఠానం ఏ ఆలోచనలో ఉందో తనకు…
తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్తో ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్లో పాల్గొన్నారు.
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 8.15 గం.కు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
ఎమ్మెల్సీ చింతపండు నీవన్ (తీన్నార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలాకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది.
Meenakshi Natarajan తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియమితుడైన ఏఐసీసీ ఇంచార్జీ, మీనాక్షి నటరాజన్ శుక్రవారం ఉదయం తెలంగాణ చేరుకున్నారు. ఆమె ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి సాధారణ రైల్లో రావడం విశేషం. కాచిగూడ రైల్వే స్టేషన్కు చేరుకున్న ఆమెను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఘనంగా స్వాగతించారు. మహేష్ కుమార్ గౌడ్ ఆమెకు కండువా కప్పి మరింత ఆతిథ్యం అందించారు. ఈ ఘట్టం రాష్ట్ర కాంగ్రెస్ నేతల మధ్య ఆనందాన్ని కలిగించింది. మీనాక్షి నటరాజన్ అనంతరం గాంధీ…
Ponnam Prabhakar : రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ కన్వేక్షన్ హల్ లో అర్బన్ మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వ నాథన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత 15 నెలలుగా మనం చేసిన అభివృద్ధి పనులు పట్టభద్రుల…