CLP Meeting: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం (CLP) సమావేశం నేడు (మంగళవారం) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా తీసుకెళ్లే దిశగా చర్చలు సాగనున్నాయి. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.., జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రంలోని మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండి ప్రభుత్వ పథకాలను వివరించేందుకు సన్నధమవుతున్నారని తెలిపారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం అయ్యేలా కార్యకర్తలందరూ క్షేత్ర స్థాయిలో పనిచేయనున్నట్టు వెల్లడించారు.
Read Also: Wild Hearts Pub: వైల్డ్ హార్ట్ పబ్‌పై దాడులు.. పోలీసుల అదుపులో 17 మంది యువతులు..
ఇక నేడు (మంగళవారం) ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో జరగనున్న సీఎల్పీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న భూభారతి, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఎస్సీ వర్గీకరణ వంటి సంక్షేమ పథకాలతో పాటు అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలన్న అంశంపై చర్చలు జరపనున్నారు. ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసే అవకాశం కూడా ఈ సమావేశంలో ఉండనుంది.