TPCC Mahesh Goud : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫాం హౌస్లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఇటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. ప్రజలు ఫాం హౌస్ పాలన… గడీల పాలన కోరుకోవడం లేదన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన…
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్కు ప్రేమ్ సాగర్ రావు ప్రధాన స్థంభమని ప్రశంసించారు. ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే, పంచాయతీ ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు. కేబినెట్ విస్తరణపై మాట్లాడుతూ, ఇది గోప్యమైన అంశమని, ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేమని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు…
CM Revanth Reddy : చంద్రవంచ గ్రామ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ గ్రామం నుంచి ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కొడంగల్ నియోజక వర్గానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంటుందని, రైతుకు కాంగ్రెస్కు చాలా అనుబంధం ఉంది.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది.. ఆనాడు 78 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు చేసిన మంచి పనులను…
దావోస్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు.
Bhatti Vikramarka : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే పర్వం జరగలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గడిచిన పది సంవత్సరాల్లో నిరుద్యోగులు గ్రూప్ వన్ పరీక్ష రాయలేక పోయారని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతీ నెలా పండగ లాగా నియామక పత్రాలు ఇచ్చామన్నారు భట్టి విక్రమార్క. సంవత్సరం లోపే 56 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్యాలెండర్ ప్రకటించామన్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు…
Srinivas Goud: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మీడియాతో నేడు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రానికి సాగునీటి రంగంలో చేసిన అన్యాయాలను గుర్తుచేస్తూ, వాటిని తవ్వితే పుట్టల నుంచి పాములు బయటకు వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారు. తెలంగాణకు సాగునీటి రంగంలో కాంగ్రెస్ చేసిన పాపాలు తవ్వితే అన్ని విపత్తులుగా బయట పడతాయని శ్రీనివాస్…
Minister Seethakka: హైదరాబాద్ నగరంలోని ఎర్రమంజిల్ లో ఉన్న మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజనతో పాటు అన్ని జిల్లాల డిఆర్డిఓల అధికారులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై దిశానిర్దేశం చేస్తూ మంత్రి పలు కీలక సూచనలు చేశారు. కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తామన్న మంత్రి,…
Congress : కాంగ్రెస్ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈనెల 27న తెలంగాణ పర్యటనకు రానున్నారని కాంగ్రెస్ హైకమాండ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న ‘సంవిధాన్ బచావో’ ప్రదర్శనలో వారు పాల్గొనబోతున్నారు. Siddipet: కొండపోచమ్మ ప్రాజెక్టులో ఐదుగురు గల్లంతు.. ఘటనపై సీఎం ఆరా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ…
CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) సమావేశం జరిగింది. గాంధీ భవన్లో జరిగిన ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో…
Kadiyam Srihari: తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పథకం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సన్నధాన్యానికి బోనస్ ఇచ్చిన ఘనత తెలంగాణదని, ఈనెల 26 నుంచి ఎకరాకు 6000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం రైతుల అకౌంట్లో ఎలాంటి ఆంక్షలు లేకుండా జమ చేయబడుతుందని ఆయన తెలిపారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న అనేక చర్యలను తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 25 లక్షల…