CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్! ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఇటీవల ఎంపీ చామల, రోజుకొకరిని మంత్రిగా ప్రకటిస్తూ వస్తున్న వ్యాఖ్యలు పార్టీకి మంచి పేరు తీసుకురావని సీఎం హెచ్చరించారు. మంత్రి వర్గ విస్తరణ విషయంలో అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అని, ఈ అంశంపై ఇకపై ఎవరూ మాట్లాడొద్దని రేవంత్ స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ లక్ష్యాలను స్పష్టంగా వివరించారు. “మన ప్రధాన లక్ష్యం రెండోసారి అధికారంలోకి రావడం. అందుకు అనుగుణంగా అందరూ పని చేయాలి. నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే మన ఫోకస్,” అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలకు సీఎం ఓ కీలక సూచన కూడా చేశారు. “మీ నియోజకవర్గంలో గెలవడానికి కావాల్సిన ప్రాజెక్టులు తెచ్చుకోండి. వాటిని పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటా,” అని హామీ ఇచ్చారు.
అంతేకాదు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకోవాలని సీఎం సూచించారు. “మీరు పర్యటనలు ముగించాక, నాతో అపాయింట్‌మెంట్ తీసుకుని మాట్లాడొచ్చు. ప్రతి నియోజకవర్గ అవసరాలను పరిశీలిస్తా,” అని రేవంత్ అన్నారు.
మంత్రి వర్గ విస్తరణపై అధిష్ఠానం ఇప్పటికే చర్చలు జరిపిందని, ఈ విషయంలో ఎవరూ ఊహాగానాలు చేయొద్దని సీఎం గట్టిగా చెప్పారు. ఎంపీ చామల వంటి నాయకులు ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, ఇకపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చూపిన నాయకత్వం, పార్టీని గెలిపించడంపై ఫోకస్ చేసిన తీరు ఎమ్మెల్యేల్లో ఉత్సాహాన్ని నింపినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మరోసారి అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే కష్టపడాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రతీ ఎమ్మెల్యే జీతం నుండి రూ.25 వేలు పార్టీకి ఇవ్వాలని సీఎల్పీ నిర్ణయం తీసుకున్నారు. పార్టీని బ్లాక్ మెయిల్ చేస్తా అంటే కుదరదని, భయపడే పరిస్థితిలో పార్టీ లేదని, అద్దంకి దయాకర్ లాగా ఓపికతో ఉండాలి.. దయాకర్ ఓపికగా ఉన్నాడు కాబట్టి.. ఎమ్మెల్సీ అయ్యాడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Redmi A5 4G: రెడ్‌మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ విడుదల.. వావ్ అనిపించే ఫీచర్స్