పూనమ్ కౌర్ చేయి రాహుల్ కావాలని పట్టుకోలేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. పాదయాత్ర చేయని దిక్కుమాలిన పార్టీ ఒక బీజేపీ మాత్రమే అని మండిపడ్డారు. పాదయాత్రలు చేస్తే జనంతో ఎలా ఉండాలో తెలుస్తుందని అన్నారు.
ధరణి పోర్టల్ తంటాలను తెంచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు మునుగోడు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. దేశ సమైక్యత కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర అని అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యలపై రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారని తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎట్టకేలకు నేడు ఆస్ట్రేలియాకు బయలు దేరనున్నారు. మళ్లీ తిరిగి నవంబర్ 7న హైదరాబాద్ రానున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు షురూ కావడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది.