Konda Surekha: పూనమ్ కౌర్ చేయి రాహుల్ కావాలని పట్టుకోలేదని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. పాదయాత్ర చేయని దిక్కుమాలిన పార్టీ ఒక బీజేపీ మాత్రమే అని మండిపడ్డారు.
పాదయాత్రలు చేస్తే జనంతో ఎలా ఉండాలో తెలుస్తుందని అన్నారు. తప్పులుంటే వేలెత్తి చూపెట్టాలి గాని చిల్లర ప్రయత్నాలు బీజేపీ మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ మహిళలను గౌరవిస్తుందని అన్నారు. ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ వరకు మహిళలని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆడవాళ్లను తల్లిలాగ చూసే పార్టీ కాంగ్రెస్ అన్నారు. బీజేపీ నేతల తప్పుడు ప్రచారం వళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాయని అన్నారు. పార్టీ నాయకులని బతిమిలాడే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. వస్తే వచ్చారు.. పోతే పోయారు అనుకుంటుందని అన్నారు. వెంకటరెడ్డి తప్పు చేస్తే వెంటనే నోటిస్ ఇచ్చారన్నారు. పార్టీ ఒకప్పటిలాగా లేదని తెలిపారు. నాయకులు అంతా కలిసి పని చేస్తున్నారని కొండా సురేఖ అన్నారు.
Read also: Virat Kohli: హోటల్ రూమ్ వీడియో లీక్.. మండిపడ్డ కోహ్లీ
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని వివాదాస్పద హీరోయిన్ పూనం కౌర్ కలిసింది. ఈ మేరకు కాసేపు రాహుల్ గాంధీతో కలిసి పూనం కౌర్ పాదయాత్రలో పాల్గొంది. అయితే రాహుల్ గాంధీని పూనమ్ కౌర్ కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రేపుతోంది. రాహుల్ చేయిని పూనమ్ కౌర్ పట్టుకున్న ఫోటోను బీజేపీ కార్యకర్త ప్రీతి గాంధీ పోస్ట్ చేయగా అది వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా తాత అడుగు జాడల్లో రాహుల్ గాంధీ నడుస్తున్నాడంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఎడ్వినా మౌంట్‌బాటన్‌తో నెహ్రూ సంబంధం గురించి కూడా అభ్యంతరకరమైన సందేశాలను సోషల్ మీడియాలోను, వాట్సాప్‌లోను బీజేపీ నేతలు షేర్ చేస్తున్నారు. మరోవైపు ప్రీతిగాంధీ పెట్టిన పోస్టుపై నటి పూనం కౌర్ కూడా స్పందించారు. తాను జారి పడబోతే రాహుల్ గాంధీ తన చేతిని పట్టుకున్నారని పూనమ్ కౌర్ వెల్లడించారు. ప్రీతి గాంధీ పెట్టిన పోస్టు చాలా అవమానకరంగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి ‘నారీశక్తి’ గురించి మాట్లాడటం మీకు గుర్తుందా అంటూ ప్రశ్నించారు. మహిళల పట్ల రాహుల్ గాంధీ ఆదరణ, గౌరవం, వైఖరి తన గుండెను తాకిందని.. చేనేత కార్మికుల సమస్యల గురించి విన్నందుకు రాహుల్ గాంధీకి, చేనేత కార్మికులతో పాటు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పూనం కౌర్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే..