Komatireddy Venkat Reddy: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే తో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. హైద్రాబాద్ హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్న థాక్రేతో సమావేశమైన కోమటిరెడ్డి మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించదని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తనకిచ్చిన AICC షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోనని అన్నారు.…
Manikrao Thakre : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్గా ఏఐసీసీ అధిష్టానం మాణిక్రావు థాకరేను నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్ఛార్జ్గా ఉన్న మాణిక్యం ఠాగూర్ను గోవా ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మార్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ చీఫ్ మార్పు, ఇన్ఛార్జ్ల మార్పు తన పరిధిలోకి రాదన్నారు. టీకాంగ్రెస్పై త్వరలోనే స్పష్టత వస్తుందని దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్లో పంచాయతీపై అధిష్ఠానం సీరియస్గానే నజర్ పెట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను పరిశీలకుడిగా పంపిస్తోంది. ఇవాళ సాయంత్రం ఆయన హైదరాబాద్కు రాబోతున్నారు. అధిష్ఠానం జోక్యంతో సీనియర్ నేతల సమావేశం వాయిదా పడింది.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై చర్చించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు.
కొత్త కమిటీల కోసం కళ్లల్లో వత్తులు వేసుకొనిమరీ ఎదురు చూస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. అదిగో ఇదిగో అని తేదీలు వాయిదా పడుతున్నాయి తప్ప.. ఢిల్లీ నుంచి కబురే లేదు. ఇంతలో బయటకు వస్తున్న లీకులు.. జరుగుతున్న చర్చలు.. అసంతృప్తిని రాజేస్తున్నాయి. దానిపైనే గాంధీభవన్లో చర్చ జరుగుతోందట. పదవుల్లో మార్పులు చేర్పులపై కాంగ్రెస్లో కలకలం పీసీసీ కార్యవర్గంతోపాటు కొత్త డీసీసీల నియామకాలపై తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న మెజారిటీ నాయకులు..…