Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎట్టకేలకు నేడు ఆస్ట్రేలియాకు బయలు దేరనున్నారు. మళ్లీ తిరిగి నవంబర్ 7న హైదరాబాద్ రానున్నారు. అయితే మునుగోడు ఉపఎన్నిక నామినేషన్లు షురూ కావడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది. నువ్వా నేనా అన్నట్లుగా మునుగోడులో ప్రచారాల హోరు జరుగుతున్న నేపథ్యంలో.. ఈనెల (అక్టోబర్) 15న కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబంతో ఆస్ట్రేలియా పర్యటన వెళ్లనున్నట్లు ప్రచారం జరిగింది. తన తమ్ముడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరుపున బరిలో వుండి ప్రచారంలో పాల్గొంటే మరి తన సోదరుడికి వ్యతిరేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ తరుపున ప్రచారం చేయాలి. ఈనేపథ్యంలో మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం ఓరేంజ్ లో పోటాపోటీ ప్రచారాలు జరుగుతాయని ఆశించిన వారందరికి నిరాశే ఎదురైందనే వార్తలకు కోమటిరెడ్డివెంకట్ రెడ్డి ఆ వార్తలను తిప్పి కొట్టారు. అది నా పర్సనల్ నేను నా కుటుంబంతో టూర్ వెళతానా లేదా అనేది అది నా ఇష్టం మునుగోడు ప్రచారానికి వీఐపీలు వెళతారు.. హోంగార్డులతో పనిలేదని రేవంత్ కు చురకలంటించారు.
Read also: Allu Aravind: ఆయన తిడతాడేమోనని ముందే చూపించాను : అల్లు అరవింద్
అయితే అక్టోబర్ 15ను కాకుండా ఇవాళ(21)న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన కుటుంబంతో సహా టూర్ వెళ్లనున్నారు. మళ్లీ ఆయన తిరిగి మునుగోడు ఎన్నిక తరువాతే.. అంటే నవంబర్ 7న రానున్నారు. అయితే.. నవంబర్ 3న ఎన్నిక…నవంబర్ 6న కౌంటింగ్ జరగనుంది. మునుగోడులో కాంగ్రెస్ బలం పుంజుకునేందుకు హోరా హోరీగా ఎన్నిక ప్రచారం జరుగుతుండగా కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉండి తన తమ్ముడు బీజేపీలో చేరడంతో.. కాంగ్రెస్‌లో అన్న వుండి ఎటువంటి ప్రచారం చేయకపోవడం పై సర్వత్రా విమర్శలు దారితీస్తున్నాయి. తమ్మడు కోసం అన్న త్యాగమా? ఎటువంటిదైనా సరే ఏ పార్టీలో వున్నా వారి తరుపున ప్రచారంలో సీనియర్లు పాల్గొని వారి పార్టీకోసం ప్రచారం చేయాల్సింది పోయి ఇలా టూర్ అంటూ వారి కుటుంబ సభ్యులతో వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. టూర్ అనేది వ్యక్తిగత విషయం అయినా తమ్మడు కోసం అన్న త్యాగమా? ఇరు పార్టీలు వేరు వేరు అయినా రక్తం ఒక్కటే కాదా అంటూ విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి తరుపున రేవంత్ రెడ్డి మునుగోడులో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నిన్న గుర్రంమీద ఎక్కి సవారి చేస్తూ ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్, బీజేపీ పై విమర్శలు చేస్తూ మునుగోడులో హస్తం జెండాను ఎగరవేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టూర్ కాంగ్రెస్ నాయకులకు గట్టిదెబ్బే అన్నట్లు తెలుస్తోంది.
Chad: చాద్‌లో దారుణం.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో కాల్పులు..60 మంది మృతి