కాంగ్రేస్ ను దెబ్బతీసేందుకే టీఆరెస్, బీజేపీ ల కుట్ర చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్టీవీతో చిట్ చాట్ చేసిన ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించిందని అన్నారు.
తెలంగాణలో రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ. రేవంత్రెడ్డి, ఇతర టీపీసీసీ నేతలు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో భేటీ అయ్యారు.
తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్ కార్యచరణను రూపొందించేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈరోజు సాయంత్రం జూమ్ మీటింగ్ను ఏర్పాటు చేసింది. ఈనేపథ్యంలో.. నేరుగా సమావేశం పెట్టకుండా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి సంచలనంగా మారింది. దీనిపై ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై స్పందించిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.