Telangana Congress: నేడు సీఎం అధ్యక్షతన కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం..
- నేడు సీఎం అధ్యక్షతన కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం..
- స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్‌పై చర్చలు జరిగే అవకాశం.
- నాంది మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress: హైదరాబాద్‌లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా, స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, రాష్ట్ర బడ్జెట్‌పై చర్చించనున్నట్లు సమాచారం. రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది. ఈ సమావేశం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ప్రారంభమవుతుంది. ముందుగా పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ సమావేశమవుతారు. ఆ తర్వాత జిల్లాల వారీగా భేటీలు జరుగుతాయి. మొదట ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాత కరీంనగర్, వరంగల్.. అనంతరం నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ఆయా జిల్లాల్లోని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు కూడా హాజరవుతారు.
Also Read: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
అన్ని జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం పెంచడమే ఈ భేటీల ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాల నుండి సమాచారం. నియోజకవర్గ స్థాయిలో తలెత్తుతున్న విభేదాలను పరిష్కరించేందుకు, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంపై పార్టీ దృష్టిపెట్టనుంది. సంక్రాంతి అనంతరం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలు ప్రస్తావించారు. కొందరు మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా సీఎం రేవంత్ ఈ నెల 1న మంత్రులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. నిధుల వినియోగం, మార్చి వరకు ప్రభుత్వ ప్రాధాన్యాలను స్పష్టంగా తెలియజేశారు. అలాగే, ఎమ్మెల్యేల వ్యవహారశైలి, మంత్రుల మధ్య సమన్వయం, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై చర్చించారు.
Also Read: Ram Charan RC 16: రామ్ చరణ్ RC 16 షూట్ కి స్పెషల్ గెస్ట్
కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలలో పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తిని అధిగమించడానికి, పార్టీ కేడర్‌తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి గురువారం సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలకు ప్రణాళికలు రూపొందించే సదవకాశంగా మారనుంది.
తాజావార్తలు
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..