CM Revanth Reddy: హైదరాబాద్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి..
- దావోస్‌లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
- ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే..,
- తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి- సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన,
- పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలి- సీఎం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, హీరో మోటార్ కార్ప్ సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రమాణాలతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, పర్యావరణ అనుకూల నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు సహకరించాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం.. తక్కువ ఖర్చుతో ప్రజలు వేగంగా ప్రయాణించాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం సమకూర్చుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Red Alert: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రెడ్ అలర్ట్..
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం.. పర్యావరణహితంగా హైదరాబాద్‌ను నెట్ జీరో సిటీగా తీర్చిదిద్దాలనేది తమ అభిమతమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు హైదరాబాద్‌లో ఉండాలని కోరుకుంటున్నాం.. ఎలక్టిక్ వెహికిల్స్‌పై తాము ప్రత్యేక దృష్టిని సారించామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు చేశామని తెలిపారు. భారత దేశంలోనే ఈవీ వాహనాలు అత్యధికంగా అమ్ముడుపోయే రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొబిలిటీ ఒక్కటే అన్నింటికీ పరిష్కారం కాదు.. ఇప్పుడున్న పరిస్థితులను పర్యావరణ అనుకూలంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ప్రజా రవాణా వ్యవస్థలో 3 వేల ఎలక్ర్టిక్ బస్సులు ప్రవేశపెడుతున్నామని తెలిపారు.
Davos: ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, ఫడ్నవీస్..
తెలంగాణ డ్రైపోర్టును నిర్మించి వేర్ హౌజ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి తీరప్రాంతం లేని లోటును పూడ్చడానికి ఈ డ్రై పోర్టును మచిలీపట్నం పోర్టుకు రోడ్డు, రైల్వే మార్గాలతో అనుసంధానం చేస్తామని చెప్పారు. నగరాల అభివృద్ధికి, వాటి భవిష్యత్తుకు అర్బన్ మొబిలిటీ భవిష్యత్తుకు పునాది అన్నారు. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో చేరుకునే రవాణా సదుపాయాలున్న నగరాలే ఎక్కువ కాలం మనగలుగుతాయని తెలిపారు. హైదరాబాద్ నగరంలో 1.2 కోట్లకు పైగా జనాభా ఉంది.. దాదాపు 100 కిలోమీటర్లకు పైగా కొత్తగా మెట్రో లైన్లను నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పుడున్న దానికంటే ఇది రెండింతలు ఎక్కువని తెలిపారు. తాను తన బృందంతో కలిసి జ్యూరిచ్ నుంచి దావోస్‌కు రైలులో ప్రయాణించాం.. అదొక అందమైన అనుభూతిని కలిగించే ప్రయాణమని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ 160 కి.మీ మేరకు ఔటర్ రింగ్ రోడ్డు ఉంది.. ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల 360 కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నాం.. ఆ రెండు రింగ్ రోడ్లను కలుపుతూ రేడియల్ రోడ్లు కూడా నిర్మిస్తాం.. రింగ్ రోడ్లకు అనుబంధంగా రింగ్ రైల్వే లైను నిర్మించాలనే ఆలోచనలున్నాయని సీఎం పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!