CM Revanth Reddy : చంద్రవంచ గ్రామ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ గ్రామం నుంచి ప్రభుత్వం చేపట్టిన నాలుగు పథకాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కొడంగల్ నియోజక వర్గానికి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంటుందని, రైతుకు కాంగ్రెస్‌కు చాలా అనుబంధం ఉంది.. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది.. ఆనాడు 78 వేల కోట్లతో రైతులకు రుణమాఫీ చేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు చేసిన మంచి పనులను వారసత్వంగా తీసుకుని ఈ ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తోందని, రైతులకు మొదట విడతలో 7 వేల కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ దే అని, దేశంలో ఎక్కడ కుడా రుణమాఫీ చేయాని విధంగా తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తెచ్చామని, ఉచిత బస్సు స్కీమ్ ద్వారా 4 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీ కార్పొరేషన్ కు చెల్లించామని ఆయన పేర్కొన్నారు.
YS Jagan: వారికి శుభాకాంక్షలు తెలిపిన జగన్..
అంతేకాకుండా..’ఈ రోజు రాత్రి 12 గంటల తరువాత రైతు భరోసా ద్వారా రైతుల ఖాతాలో ఎకరాకు 6 వేల రూపాయలు అకౌంట్ లో జమ చేయబోతున్నాం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని 10 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. కొడంగల్ నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదు. మార్చి 31 నాటికి నియోజక వర్గంలో 3500 ఇండ్లు కట్టిస్తాం.. రాబోయే నాలుగేళ్లలో ఈ ప్రాంతంలో 15 వేల నుంచి 20 వేల ఇందిరమ్మ ఇండ్లు కొడంగల్ లో నియోజక వర్గంలో కట్టించి తీరుతా. బీ ఆర్ ఎస్ కు రేషన్ కార్డు ఇవ్వాలన్న సోయి లేదు.. కానీ మా ప్రభుత్వం రేషన్ కార్డు ప్రతి పేదవాడికి అందాలని సంకల్పించింది. క్రమం తప్పకుండా అధికారులను గ్రామాల్లోకి పంపించి ప్రజాపరిపాలన లో ప్రజలకు మేలు చేకూరుస్తున్నాం.. ప్రజల దగ్గరికే నేను వచ్చాను.. రాష్ట్ర స్థాయి అధికారి నుంచి మొదలుకుని ప్రతి ఒక్క అధికారి ప్రజల వద్దకు వస్తున్నారు.. ప్రజాపాలన అంటే ఇది.. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం మాది.. గత పాలనలో ఈ పరిస్థితి ఉందా.. దొరల పాలన కొనసాగించారు.. అర్హులైన లబ్ది దారులకు పారదర్శకంగా పథకాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.. పాలమూరు రంగారెడ్డి, నారాయణపేట సాగు నీటి పథకాలు పూర్తి చేస్తాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలేదు.
13 నెలల కాలంలో ఒక్కసారైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ కి వచ్చాడా.. ఆయనకు బాధ్యత లేదా.. కొడంగల్ నియోజక వర్గంలో పరిశ్రమలు తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.. పరిశ్రమలు తెస్తుంటే అధికారులపై దాడులు చేయిస్తున్నారు.. ఇది న్యాయమా.. ఈ ప్రాంతం అభివృద్ధి జరగవద్దా.. మన పిల్లలకు ఉద్యోగ కల్పన కోసం పరిశ్రమలు తేవాలని చూస్తుంటే బీ ఆర్ ఎస్ రెచ్చగొడుతుంది.. అభివృద్ధి అడ్డుకుంటుంది.. రేషన్ కార్డులు కుడా పూర్తి చేస్తాం.. రైతు భరోసా కుడా మార్చి 31 లోపు వారి అకౌంట్లలో ఎకరాకు 6 వేల రూపాయలు జమ అవుతాయి’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
TPCC Mahesh Goud: ఎన్ని అవంతరాలు ఎదురైనా కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్