Uttam Kumar Reddy : త్వరలో పంచాయతీ ఎన్నికలు.. ప్రభుత్వ పథకాలపై బీఆర్ఎస్‌వి అనవసర విమర్శలు
- తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రేమ్ సాగర్ రావు కీలకం
- ప్రజా సంక్షేమం మా లక్ష్యం - ప్రభుత్వ పథకాలపై ఉత్తమ్ స్పందన
- లిఫ్ట్ ఇరిగేషన్ పనుల ఆలస్యంపై అధికారులపై మంత్రి ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రేమ్ సాగర్ రావు ప్రధాన స్థంభమని ప్రశంసించారు. ప్రజలకు అన్ని ప్రభుత్వ పథకాలు సమర్థంగా అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అలాగే, పంచాయతీ ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తామని తెలిపారు.
కేబినెట్ విస్తరణపై మాట్లాడుతూ, ఇది గోప్యమైన అంశమని, ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి సమాచారం ఇవ్వలేమని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలపై అవాస్తవ ప్రచారం చేయడం సరైనది కాదని మండిపడ్డారు. నాలుగు కీలక పథకాల గురించి బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఏవి ఆగే ప్రసక్తే లేదని, 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో నడిచే నాయకుడిగా ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రచారానికి భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Also Read
Delhi Elections: అభ్యర్థి కాళ్లు మొక్కిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్.. అసలేం జరిగిందంటే..!
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఇంత మంచి పాలన చూడలేదని, రాష్ట్ర అభివృద్ధికి ఉద్దేశించిన పథకాలు వేగంగా అమలవుతున్నాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు త్వరలో నిర్వహించి స్థానిక పరిపాలనను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. తన రాజకీయ జీవితం విశ్వసనీయతతో నిండిపోయిందని, వరుసగా ఏడు సార్లు ప్రజల ఆదరణ పొందిన వ్యక్తినని గుర్తుచేశారు.
కేటీఆర్ అరెస్టుపై స్పందించేందుకు మంత్రి నిరాకరించారు. తన సొంత నియోజకవర్గమైన హుజుర్ నగర్‌లో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ప్రారంభం కాకపోవడంపై ఇంజినీర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనులను ప్రారంభించాలని అధికారులకు ఫోన్‌లోనే ఆదేశాలు ఇచ్చారు. సమస్యలను గుర్తించి, పనులను మౌలికంగా ముందుకు తీసుకెళ్లాలని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూర్యాపేట సీఈతో పాటు జిల్లా ఇరిగేషన్ అధికారులను హైదరాబాదుకు రావాలని ఆదేశించడంతో పాటు, రాష్ట్రంలోని అభివృద్ధి పనులపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. “నా సొంత నియోజకవర్గంలోనే పనులు ఇలా సాగితే, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంటుంది?” అంటూ మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
Squid Game 3: స్క్విడ్ గేమ్ 3 స్ట్రీమింగ్ డేట్ ప్రకటన.. ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?