KTR : బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.
- ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్‌కు కొంత నష్టం జరిగింది
- డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు
- కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదు : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : ఖమ్మం జిల్లాలోని ప్రత్యేక రాజకీయ సమీకరణాల వల్ల బీఆర్ఎస్‌కు కొంత నష్టం జరిగిందన్నా కేటీఆర్. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎంతో కలిపి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని, కానీ వరదల సమయంలో వాళ్లతో పైసా ఉపయోగం లేదని ఆయన విమర్శించారు. ఒక కుటుంబం వరద నీళ్లలో చిక్కుకుంటే కనీసం హెలికాప్టర్ తెప్పించి కాపాడాలన్న సోయి మంత్రులకు లేదని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యేల బర్త్‌డేలకు ఇంకా వేరే పనికిమాలిన పనులకు మంత్రులు హైదరాబాద్ నుంచి కూతవేటు దూరానికి కూడా హెలికాప్టర్లలో పోతున్నారని ఆయన హెద్దేవ చేశారు. బీఆర్ఎస్ హయాంలో వరదలు వచ్చినప్పుడు భూపాలపల్లి జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా నాలుగు హెలికాప్టర్లను పంపి ప్రజలను కాపాడామని, మాకు ప్రాణం విలువ తెలుసు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వరద తగ్గుముఖం పట్టినంకనే ఖమ్మంలో మంత్రులు పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఓపెన్ టాప్ జీపులో చేతులు ఊపుతూ కాలు కింద పెట్టకుండా అటు ఇటు తిరిగి వెళ్లిపోయాడు. ప్రజలు తిడుతున్న తిట్లను వింటే పౌరుషమున్న ఎవడైనా బకెట్ నీళ్లలో దూకి చచ్చేవాడని, కానీ రేవంత్ రెడ్డికి రోశం లేదు కాబట్టి అన్ని దులుపుకొని తిరుగుతున్నాడని ఆయన సెటైర్ వేశారు.
Maruti Celerio: ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగులు.. ధర తక్కువే..!
Also Read
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
- CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
అంతేకాకుండా..’మా స్కూటీ ఏమైందని కాలేజీ పిల్లలు కూడా పోస్ట్ కార్డు ఉద్యమం మొదలుపెట్టారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోయేసరికి ఎంతో నష్టపోయామన్న భావనలో తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఉన్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం లోని పనులతో పాటు తెలంగాణలోని ప్రతి పని కాంట్రాక్టు కూడా ఇవ్వాళ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతుంది. కాంట్రాక్టు మంత్రి, ఆయన కమిషన్ల కోసమే ముఖ్యమంత్రి పని చేస్తున్నారని నిన్న కొడంగల్ లో చెప్పా. డిప్యూటీ సీఎం 30% కమిషన్లు తీసుకొని పనులు చేస్తున్నారని సొంత పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నారు. బీసీ సోదరులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. 42% రిజర్వేషన్ అమలు చేస్తామని, సబ్ ప్లాన్ అమలు చేస్తామని లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామని ఐదు వందల శాతం బీసీ జనాభాను తగ్గించింది. కేసీఆర్ చేపించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51.5% ఉంటే రేవంత్ చేసిన కులగరణ సర్వేలో ఐదున్నర శాతం తగ్గించి 46% కి బీసీ జనాభాను చూపిస్తుంది. మహబూబబ్‌నగర్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న ఓ మంత్రిని తులం బంగారం లేదని మహిళలు ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టి ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారు. ఈ కుతంత్రాలను గులాబీ దండు అడ్డుకుంటుంది. త్వరలోనే ఖమ్మం వస్తాను.’ అని కేటీఆర్ అన్నారు.
CM Chandrababu: అడవి మార్గంలో శ్రీశైలానికి వచ్చే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించొద్దు
తాజావార్తలు
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!