రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్.. మంత్రులు ఎవరు, ఎల్లుండి ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు? అనే విషయాలు తర్వాత చెబుతాం అన్నారు.. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది.. అంతా టీమ్‌గా పనిచేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్.
Mallikarjun Kharge Gives Clarity on Telangana CM Candidate: తెలంగాణ సీఎం ఎవరు? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం పదవికి సీనియర్లు పోటీ పడుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ పరిశీలకులు.. సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదించారు. ఈ విషయంపై ఖర్గే మంగళవారం ఉదయం ఓ క్లారిటీ ఇచ్చారు.…
Revanth reddy: తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ ఓ సెన్సేషన్. రేవంత్ మాటలు.. ప్రత్యర్థులపై విమర్శల దాడి చేస్తారు. ఆయన మైక్ పట్టుకుంటే చాలు తన స్పీచ్‌తో అగ్రెసివ్‌గా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు.
నిర్మల్ జిల్లాలోని చించోలి - బిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు రైతు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ సెంటిమెంట్ కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ పాతది అయిపోయింది.. ఇంకా ఏదైనా కొత్తది తెచ్చుకోవాల్సిందే.. చిన్న వర్షానికి హైదరాబాద్ మునిగి పోతుంటే ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.
వినాయక చవితి పండగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మట్టి గణపతిని ఏర్పాటు చేసి.. ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. అనంతరం కేసీఆర్ దంపతులతో పాటు కేటీఆర్, శైలిమ దంపతులు పూజలు చేశారు.
ఇందిరాపార్క్ దగ్గర సెకండ్ ఎఎన్ఎమ్ ల ధర్నాకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ధర్నాను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ ఎఎన్ఎమ్ లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు..
CM KCR: బీసీల మాదిరిగానే మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేసీఆర్ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ 69 జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు నిర్వహిస్తుంది. కేసీఆర్ పెట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈనేపథ్యంలో.. సిద్దిపేట జిల్లా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్ని కేక్ కట్ చేసిన శుభాకాంక్షలు తెలియజేశారు.