సీఎం కేసీఆర్ ఈమధ్యకాలంలో జిల్లాల పర్యటనలు బాగా చేస్తున్నారు. తాజాగా మరో పర్యటనకు తెరతీశారు. వనపర్తి నుండి “మన ఊరు – మన బడి” కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వనపర్తి జిల్లా పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రం నుంచి ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని సిఎం కేసిఆర్ ప్రారంభిస్తారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం కన్నెతండా…
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. చిరంజీవి కరోనా బారిన పడటంతో ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. కరోనా నుంచి చిరంజీవి త్వరగా కోలుకోవాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. కాగా తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని బుధవారం నాడు ట్విటర్ ద్వారా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. తాను హోమ్ క్వారంటైన్‌లోనే ఉన్నట్లు చెప్పారు. Read Also: ‘శ్యామ్ సింగ రాయ్’ ఖాతాలో గ్లోబల్ రికార్డు…
తెలంగాణలో టీఆర్ఎస్ ను తరిమికొడతాం. ఈ మహోద్యమంలో ఉద్యమకారులంతా కలిసి రండి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. “తీన్మార్” మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ బీజేపీలో చేరారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న వ్యక్తి బీజేపీలో చేరడం సంతోషంగా ఉంది. హృదయపూర్వకంగా బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నాం. మల్లన్న నిఖార్సయిన తెలంగాణ వాది, ఉద్యమకారుడు. స్వార్థంతో మల్లన్న బీజేపీలో చేరడం లేదు. నరేంద్ర మోడి ప్రభుత్వం…
ఢిల్లీ పర్యటనలో స్పెషల్ మిషన్‌పైనే సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారా? ఇప్పట్లో సాధ్యం కాదని పార్లమెంట్‌లో పలుమార్లు కేంద్రం చెప్పినా.. ఆయన ఫోకస్ ఆ అంశంపైనే ఉందా? తాజా హస్తిన టూర్‌లోనూ ఆ విషయాన్నే ప్రధానంగా ప్రస్తావించారా? మరి.. త్వరలో క్లారిటీ వస్తుందా? ఇంతకీ ఏంటా అంశం? నియోజకవర్గాల పెంపు ఢిల్లీ టూర్‌లో ప్రస్తావించారా? పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్థానాల సంఖ్య 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలి. ఇదే…
మహిళలు, ఆడ బిడ్డల పై అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో క్రైం రేట్ పెరిగిపోతుంది. ఇక్కడ శాంతి భద్రతలను కంట్రోల్ చేస్తుంది కేసీఆర్ ఆ, కేటీఆర్ ఆ లేక హోం మినిస్టర్ ఆ అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రశ్నించారు. ఐటీ పైన అసెంబ్లీ లో చెత్త పేపర్ ఇచ్చారు…. అందులో అంత అబద్ధమే. రామ గుండం పర్టిలైజర్ ఫ్యాక్టరీ ని కేంద్రమే స్థాపించింది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు కేంద్రం నిధులు ఇచ్చిన ఏర్పాటు చేయడం…
కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాయని అంటుంటారు. ఆయన వేసే అడుగులు, తీసుకునే నిర్ణయాలు గమనిస్తే అది నిజమే అని ఎవరైనా అంగీకరిస్తారు. తాజాగా.. ఢిల్లీలో తెలంగాణ భవన్ కు శంకుస్థాపన చేస్తున్న కేసీఆర్ తీరు.. సైతం ఈ చర్చలో ముందుకు వస్తోంది. ఇదంతా.. భవిష్యత్ రాజకీయాలకు పునాదిగా భావించవచ్చా.. అన్న ప్రశ్నలు సైతం ఉదయిస్తున్నాయి. ఇందుకు రకరకాల కారణాలను రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి రోజు రోజుకూ బలం పెరుగుతున్నాకొద్దీ..…
సెప్టెంబర్ రెండో తేదిన టీఆర్‌ఎస్ పార్టీ జెండా పండుగ జరుగనున్నట్లు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. టీ ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులతో ఇవాళ మంత్రి హరీశ్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని..ఢిల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. అదే రోజున తెలంగాణ వ్యాప్తంగా అన్నీచోట్ల, అన్నీ గ్రామాలు, పట్టణాల్లో జెండా…
సీఎం కాన్వాయ్ కు అడ్డు వచ్చిన కేస్ లో ఇద్దరు మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్ ఇస్తున్నారు. శనివారం సచివాలయం నిర్మాణ పనులు చూసేందుకు వెళ్లారు సీఎం కేసీఆర్. పోలీసుల బందోబస్తు దాటుకుని కాన్వాయ్ ఫాలో అయ్యి అడ్డు వచ్చారు ఇద్దరు యువకులు. ఓవర్ స్పీడ్ తో బైక్ నడిపిన యువకులను చూసి కాన్వాయ్ ఆగింది. ఆ ఇద్దరు యువకుల పై కేస్ నమోదు చేసిన పోలీసులు ఆ బైక్ కూడా దొంగలించిన వాహనం గా గుర్తించారు. వారం…
గిరిజనులను అనాధలుగా చేశారు సీఎం కేసీఆర్. భూముల పై హక్కులు లేకుండా చేస్తుంది ప్రభుత్వం. సీలింగ్ యాక్ట్ తెచ్చి గడిల దగ్గర బందీ అయిన భూములను పేదలకు పంచింది కాంగ్రెస్ అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలు ఐఏఎస్..ఐపీఎస్ లు అయ్యే అవకాశం కాంగ్రెస్ కల్పించింది. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ లే గిరిజనుల కు అండ. రెండు పర్యాయాలు తెరాస కి అధికారం కట్టబెట్టి నా… గిరిజనుల హక్కులు లేకుండా పోయాయి. పోడు…
కోదాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నల్గొండ ఎంపీ , టిపిసిసి మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు, అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ… సోనియాగాంధీ , రాహుల్ గాంధీ ప్రోత్సహంతో తెలంగాణ రాష్టానికి 6 సంవత్సరాలపాటు పిసిసి అధ్యక్షులుగా సేవ చేసే అదృష్టం నాకు కలిగింది. కొన్ని సంవత్సరాలుగా వివిధ పార్టీల వారు మా కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతున్న ప్రతి కాంగ్రెస్…