Telangana New CM: కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ జరిగింది.. సోషల్ మీడియాలో పెద్ద ట్రోల్ నడిచింది.. కానీ, కాబోయే సీఎం రేవంత్‌రెడ్డే అనే ప్రచారం కూడా సాగుతూ వచ్చింది.. సీఎల్పీ సమావేశంలో ఏకవాఖ్య తీర్మానం చేసి.. ఆ తీర్మానంతో ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్ ఢిల్లీ బాట పట్టిన తర్వాత.. మరింత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి.. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కూడా హస్తినకు వెళ్లడం.. అధిష్టానం పెద్దల వరుస సమావేశాలు.. చూస్తుంటే.. ఏదో జరగుతోంది? అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.. కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. ఓ జాతీయ పార్టీలో ఆ మాత్రం చర్చలు, కసరత్తులు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వాచ్చారు.. మొత్తంగా సీఎం ఎవరు? అనే ఉత్కంఠగా తెర దింపుతూ.. కేసీ వేణుగోపాల్ ప్రకటన చేశారు.. నిన్న సీఎల్పీ మీటింగ్ జరిగింది.. సీఎల్పీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశారని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. దీంతో.. తెలంగాణకు కాబేయో సీఎం రేవంత్‌రెడ్డి అనేది స్పష్టమైంది.. పీసీసీ చీఫ్ ని సీఎల్పీ నేతగా చేయాలని నిర్ణయించాం.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు.
Read Also: Aata Sandeep: యానిమల్ లో రణబీర్ ఎంట్రీ.. ఆ స్టెప్స్ నేనే నేర్పించా
రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణస్వీకారం చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చిన కేసీ వేణుగోపాల్.. మంత్రులు ఎవరు, ఎల్లుండి ఎవరెవరు ప్రమాణస్వీకారం చేస్తారు? అనే విషయాలు తర్వాత చెబుతాం అన్నారు.. సీనియర్లు అందరికీ న్యాయం జరుగుతుంది.. అంతా టీమ్‌గా పనిచేస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్. మరోవైపు.. కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్‌రెడ్డికి పిలుపు రావడంతో హుటాహుటినా ఢిల్లీకి బయల్దేరారు రేవంత్‌రెడ్డి.. హోటల్ ఎల్లాలో ఉన్న రేవంత్‌కు అధిష్టానం నుంచి సమాచారం రాగానే.. అక్కడి నుంచి బయల్దేరి మొదట ఇంటికి.. అక్కడి నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు.. ఇక, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు రేవంత్‌రెడ్డి.
Read Also: Revanth Reddy: అధిష్టానం నుంచి పిలుపు.. హుటాహుటిగా ఢిల్లీకి రేవంత్ రెడ్డి..
ఇక, రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో సంబరాలు జరుగుతున్నాయి.. మా రేవంత్ పటేల్ సీఎం అయ్యాడు అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.. ఢిల్లీకి రాజు అయినా.. తల్లికి కొడుకే అన్నట్టు.. రేవంత్ అప్పటికీ ఇప్పటికీ మా మంచి పటేల్ అంటున్నారు.. ఇకపై మా ఊరు కొండారెడ్డిపల్లి కాదు.. సీఎం ఊరు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఎప్పుడూ ఊరికి వచ్చినా.. ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాడని గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ రెడ్డి అభిమానులు సందడి చేస్తున్నారు.. కొడంగల్‌లోని రేవంత్‌ఱెడ్డి ఇంటి దగ్గర సందడి వాతావరణ నెలకొంది.. తమ నియోజకవర్గం నుంచి సీఎం అవుతున్నందకు ఆనందంగా ఉంది అంటున్నారు స్థానికులు.. రేవంత్ రెడ్డి నివాసం దగ్గరకు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.