Mallikarjun Kharge Gives Clarity on Telangana CM Candidate: తెలంగాణ సీఎం ఎవరు? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సీఎం పదవికి సీనియర్లు పోటీ పడుతుండటంతో.. కాంగ్రెస్ పార్టీలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ పరిశీలకులు.. సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారు ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదించారు. ఈ విషయంపై ఖర్గే మంగళవారం ఉదయం ఓ క్లారిటీ ఇచ్చారు. కాసేపట్లో పార్లమెంట్‌లోని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఛాంబర్‌లో కాంగ్రెస్ సమావేశం కానుంది. ఈనేపథ్యంలో ఖర్గే అక్కడికి వెళ్తూ.. మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ నూతన సీఎం ఎంపికపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మంగళవారం ఉదయం ఓ కీలక ప్రకటన చేశారు. ఈరోజే సీఎం అభ్యర్థిని ఖరారు చేస్తామని, సాయంత్రం లోపు సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని ఖర్గే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణకు పంపిన పార్టీ పరిశీలకుల నివేదికను పరిశీలించి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం సీఎం పేరును ప్రకటిస్తామని చెప్పారు.
Also Read: Cyclone Michaung Update: తరుముకొస్తోన్న మిచాంగ్ తుఫాన్.. 90-110 కిమీ వేగంతో ఈదురు గాలులు!
సీఎం పదవి రేసులో రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రమే హస్తినకు చేరుకున్నారు. హైకమాండ్ పెద్దలను కలిసి.. సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో తమ పేర్లను కూడా పరిశీలించాలని వీరు కోరనున్నట్లు సమాచారం తెలుస్తోంది. రాహుల్ గాంధీని కూడా ఈ ఇద్దరు కలవనున్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ సీఎం అభ్యర్థి పేరున్న సీల్డ్ కవర్‌తో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇతర పరిశీలకులు మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం.