తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి 1989 నవంబర్ 8న నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు అనుముల నర్సింహారెడ్డి, అనుముల రామచంద్రమ్మలు.. ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ గ్యాడ్యుయేషన్ పట్టా పొందారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించగానే.. ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రేవంత్ బంధువులు, గ్రామ మహిళలు మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి మా ఊరి కొండారెడ్డిపల్లి కాదు సీఎం ఊరు అని అన్నారు.
Read Also: Cyclone Michaung: 20 ఏళ్ల తర్వాత అతిభారీ తుఫాన్..
రేవంత్ రెడ్డి మా ఇంటి మనిషి అని గ్రామస్థులు తెలిపారు. నా అల్లుడు సీఎం వాళ్ళ అమ్మ ఎప్పుడూ చెప్పేది.. నువ్వు ఎదో ఒక రోజు రాజు అవుతావు అని.. ఈరోజు తెలంగాణకి రాజు అయ్యాడు అని రేవంత్ రెడ్డి అత్తయ్య పేర్కొనింది. ఏమాత్రం గర్వం లేకుండా.. అక్క, అత్త, మామ, బావ అని ఊర్లో వాళ్ళను పలకరిస్తాడు.. రేవంత్ ఊరికి వచ్చాడు అంటేనే పండగే.. ఇప్పుడు ఏకంగా సీఎం అయ్యాడు.. మా ఆనందానికి అవధులు లేవు.. ఎంతో కష్టపడ్డాడు.. తండ్రి చనిపోయినా.. అన్నలే తండ్రి అయి పెంచి పెద్ద చేశారు.. తాను స్థిరపడి అన్నలకు ఒక దారి చూపాడు.. ఇకపై కొండారెడ్డిపల్లి
కాదు ఇది.. సీఎం ఊరు అంటూ వారు వెల్లడించారు. మరో వైపు, రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఒక్కసారిగా పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో ఆయన ఇంటి దగ్గరకు భారీగా హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు చేరుకుంటున్నారు.