వినాయక చవితి పండగ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మట్టి గణపతిని ఏర్పాటు చేసి.. ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. అనంతరం కేసీఆర్ దంపతులతో పాటు కేటీఆర్, శైలిమ దంపతులు పూజలు చేశారు. ఈ పూజ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి తదితరులు హాజరైనారు.
Read Also: Tirumala Brahmotsavam 2023: బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్.. పట్టువస్త్రాలు సమర్పణ..
ఇక, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు ఘనంగా కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర భక్తుల సందడి కొనసాగుతుంది. ఈరోజు ఖైరతాబాద్ గణనాథునికి తొలిపూజను వైభవంగా చేశారు. ఈ రోజు జరిగిన తొలి పూజ కార్యక్రమంలో తెలంగాణ, హర్యానా గవర్నర్లు తమిళిసై సౌందర్‌రాజన్, బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బడా గణనాథునికి పట్టువస్త్రాలు సమర్పించారు.
Read Also: IND vs AUS: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. భారత దిగ్గజ ఆటగాళ్లకు విశ్రాంతి
వినాయక చవితి వేడుకలు ప్రగతి భవన్ లో ఈరోజు ఘనంగా జరిగాయి. గణనాథుడికి ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు, శ్రీమతి శోభమ్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులను అందించాలని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి విఘ్నాలు రాకుండా… pic.twitter.com/keegArT8d1
— Telangana CMO (@TelanganaCMO) September 18, 2023