ఇందిరాపార్క్ దగ్గర సెకండ్ ఎఎన్ఎమ్ ల ధర్నాకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ధర్నాను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ ఎఎన్ఎమ్ లను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నారు.. ఇప్పటికే నేను అనేక జిల్లాల్లో స్వయంగా పాల్గొని మద్దతు ఇచ్చాను.. రెగ్యులర్ ఎంప్లాయీస్ కి లక్ష రూపాయలు జీతం వస్తే.. అదే పని చేస్తున్న కాంట్రాక్ట్ ఎఎన్ఎమ్ లకు కేవలం 25 వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు.
Read Also: ASP: మరీ అంత అర్జెంట్ కాలా సారూ… ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసిన ఏఎస్పీ
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పదే పదే చెప్పేవారు అని ఈటల రాజేందర్ అన్నారు. ప్రభుత్వమే వెట్టి చాకిరి చేయించుకుంటే ఎలా?.. కంచే చేను మేస్తే ఎలా? అనేవారు.. కాంట్రాక్ట్ నర్సు, కాంట్రాక్ట్ టీచర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇలా అందరినీ కాంట్రాక్ట్ పెడితే.. ముఖ్యమంత్రి పదవి కూడా కాంట్రాక్ట్ ఇద్ధామా అని స్వయంగా కేసీఆర్ అన్నారు అని ఈటల గుర్తు చేశారు. చట్టాలు చేసేదే మనం.. మనం అనుకుంటే కాదా అనేవారు.. మరి 10 ఏళ్ళు అవుతుంది ఎందుకు కాలేదో కేసీఆర్ చెప్పాలని ఆయన అడిగారు. మా వాళ్లకు మంచి జీతం వస్తే మంచిగా బ్రతుకుతారు.. కానీ, కేసీఆర్ కి ఎప్పుడు ఆకలితో అలమటించాలి అని అనుకుంటారు.. ఎప్పుడు అడుక్కునే స్థితిలో ఉండాలి అని అనుకుంటారు అని ఈటల విమర్శించారు.
Read Also: Muralidhar Rao: అవినీతి చేసినోళ్లు అంతా జైలుకు పోవాల్సిందే
వైద్య శాఖలో పని చేస్తున్నా కూడా.. అమ్మ నాన్నకు కూడా వైద్యం చేయించలేని దుస్థితి ఏర్పాడిందని ఈటల రాజేందర్ అన్నారు. పిల్లలకు ఏదన్నా అయితే పుస్తేల తాళ్లు కాళ్ళమీద పెట్టీ వైద్యం చేయించుకునే దయనీయమైన పరిస్థితి ఏర్పాడిందన్నాడు. ఎఎన్ఎమ్ లకు హెల్త్ కార్డులు లేవు, పెన్షన్ లేదు, చనిపోతే కనీసం అంత్యక్రియలకు డబ్బులు కూడా ఇవ్వడం లేదు.. ప్రమాద వశాత్తూ పోతే లేదా చనిపోతే కారుణ్య నియామకాలు లేవు.. ఎటుకాని దిక్కులేని పక్షులు కాంట్రాక్ట్ ఉద్యోగులు.. వీరందరీనీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేశారు.. 23 ఏళ్లుగా పని చేస్తున్నారు.. ఏ సీఎం అయినా మమ్ముల్ని పర్మినెంట్ చేయకపోతారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు అని ఈటల రాజేందర్ వ్యాఖ్యనించారు.
Read Also: Pawan Kalyan: ఏపీలో పొత్తులు.. ఎన్డీఏపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. టార్గెట్ అది ఒక్కటే..!
ధనిక రాష్ట్రం అని చెప్తున్నారు.. మరి వీరి గోస ఎందుకు తీర్చరు అని ఈటల రాజేందర్ అడిగారు. కేసీఆర్ మాటలు వింటే అబ్బా ఈయన ఇంతకు ముందే ఎందుకు సీఎం కాలేదు అన్నట్టు మాట్లాడతారు.. కానీ, పనులు మాత్రం చెయ్యరు.. ప్రభుత్వం నాలుగు వైపులా కడుతున్న నాలుగు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఉచితంగా సేవ అందించవట.. నిమ్స్ లాగా డబ్బులు కడితేనే వైద్యం అందిస్తారట.. ఈ డిపార్ట్మెంట్ పేదవారికి సేవ చెయ్యడానికి ఉంది.. ప్రతి నిత్యం పని ఉండే డిపార్ట్మెంట్.. రోజు రోజుకు జనాభా పెరుగుతుంది, రోగులు పెరుగుతున్నారు, పని పెరుగుతుంది, వీరి జీతాలు పెంచాలి అని ఈటల డిమాండ్ చేశారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
అయితే, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బెల్ట్ షాపులు వల్ల లీవర్ కారాబ్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువయ్యింది అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. న్యాయమైన డిమాండ్ కూడా తీర్చే అధికారం ఏ మంత్రికి లేదు.. అన్ని సీఎం దగ్గర తాళం వేసుకొని పెట్టుకొన్నారు.. గ్రామ కార్యదర్శి, వీఆర్వో, హెల్త్ వర్కర్స్ అందరినీ ఈ ప్రభుత్వం తీసివేస్తుంది.. ఎప్పుడు ఎవరి వంతు వస్తుందోనని ఉద్యోగులు భయపడుతున్నారు.. 10 ఏళ్ల తరువాత ఇన్ని టెంట్స్ ఎందుకు పడుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ మనో వేదనలో ఎందుకు ఉన్నారు.. ప్రతి ఒక్కరూ టెంట్ వేసే పద్దతి ఎందుకు వచ్చింది.. ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగిని రెగ్యులర్ చెయ్యాలి.. కాంట్రాక్ట్ ఎఎన్ఎమ్ లా సమస్య పరిష్కారం కోసం నేను మీకు అండగా ఉంటానని వారికి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.