తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరీంనగర్‌లో పర్యటించారు. ఇటీవల బీసీ సంక్షేమం, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిచెందడంతో వారి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు.
మహబూబాబాద్ లో బీఆర్‌ఎస్ నూత కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. బీఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో పార్టీ నేత కార్యాలయాలను బీఆర్‌ఎస్ నిర్మించింది.
తెలంగాణ కొత్త సీఎస్ ఎవరన్నది ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్ గా మారింది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి నెలకొంది. డీఓపీటీ ఆదేశాల మేరకు సోమేశ్‌కుమార్‌ను విధుల నుంచి తప్పించి కొత్త సీఎస్‌ని కూడా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీపై దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ పక్కనున్న ఏపీలో బీఆర్ఎస్ పాత్రపై రకరకాల ఉహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీలోని ప్రధాన పార్టీలకు చెందిన కొందరు నేతలు.. బీఆర్ఎస్ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఏపీలోని ముగ్గురు కీలక నేతలు రేపు బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో రాబోయేది రైతు ప్రభుత్వమే అని అన్నారు. కర్నాటకలో జేడీఎస్ కు బీఆర్‌ఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామని అన్నారు సీఎం.
రేవంత్ రెడ్డి సీఎం కావాలని సత్తుపల్లి నుండి భద్రాద్రి రాములోరు వద్దకు కాంగ్రెస్ నేత మానవతారాయ్ పాదయాత్ర చేపట్టనున్నారు. మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి ఆశీస్సులతో డిసెంబరు 12,13 తేదీల్లో పాదయాత్రకి మాజీ ఆత్మకమిటీ చైర్మన్ నున్నా రామకృష్ణ, ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ కౌన్సిల్ సెక్రెటరీ రావి నాగేశ్వరరావు, సత్తుపల్లి సొసైటీ వైస్ ఛైర్మన్ గాదె చెన్నకేశవరావులు రూట్ మ్యాప్ సిద్దం చేస్తున్నారు.
Mulayam Singh Yadav: ఉత్తర ప్రదేశ్ ఇటావా జిల్లాలోని సైఫయా గ్రామంలో సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై ములాయం భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్‌ను కేసీఆర్ పరామర్శించారు. ములాయం అంత్యక్రియల్లో కేసీఆర్‌తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ కూడా…
మునుగోడుపై సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. రేపు అభ్యర్థి అధికారికంగా ప్రకటించే అవకాశం